• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు మాటలకు తెలుగు...

చిరు మాటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?

By - Tupaki Desk
Update: 2020-01-06 05:19 GMT
ఒక సీనియర్ నటుడి గురించి మరో ప్రముఖ నటుడు మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. ఆయనకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కలేదన్న మాటను ఒక పెద్ద సభలో చెప్పటం ఆశ్చర్యకర విషయం మాత్రమే కాదు.. ఒక చక్కటి సంప్రదాయంగా చెప్పాలి. ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కి థ్యాంక్స్ చెప్పాల్సిందే.

సీనియర్ మోస్ట్ నటుడైన సూపర్ స్టార్ కృష్ణ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని తనకు అనిపిస్తోందని.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించి ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

సూపర్ స్టార్ కృష్ణ కు దాదా సాహెబ్ పురస్కారం దక్కితే అది తెలుగువారికి దక్కిన గౌరవంగా మారుతుందంటూ మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కృష్ణ గొప్పతనం గురించి పొగిడిన చిరు.. ఆయన చేసిన ప్రయోగాలు మరో నటుడు చేయలేదని చెప్పటం ఒక ఎత్తు అయితే.. అత్యున్నత పురస్కారం ఆయనకు ఇప్పించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉందన్న చిరంజీవి విన్నపానికి ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఆసక్తికరం.

ఏమైనా ఒక సీనియర్ మోస్ట్ నటుడు గురించి.. మెగాస్టార్ స్వయంగా ప్రస్తావించి.. పురస్కారానికి సిఫార్సు చేయాలనటం ఆరోగ్యకర పరిణామంగా చెప్పాలి. కాకుంటే.. ఇప్పుడీ మాటలు చెప్పే బదులు.. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పటి ప్రభుత్వంతో చిరు ఒక మాట మాట్లాడి ఉంటే.. ఆ పురస్కారాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఇప్పటికే తీసుకొని ఉండేవారేమో? చేతిలో పవర్ ఉన్నప్పుడు చిరంజీవికి ఈ విషయం గుర్తుకొచ్చి ఉంటే మరింత బాగుండేదేమో?
Tags:    
  • Chiranjeevi 
  • Jagan 
  • Kcr 
  • Sarileru Nekkevaru Audio 
  • Mahesh Babu 
  • Vijayashanti 
  • Anil Ravipudi 
  • Vijayashanti Look 
  • Sarileru Nekkevaru 
  • Sankranti Release 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS