సమంత విడాకుల గురించి ప్రశ్నలు ఎదుర్కోబోతోందా..?
విడాకుల ప్రకటన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత పై మీడియా - సోషల్ మీడియా స్పెషల్ ఫోకస్ పెడుతూ వస్తోంది. దీంతో ఆమె ఏమి చేసినా హాట్ టాపిక్ అవుతోంది. రెండు రోజుల క్రితం సామ్ ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో పాల్గొనడానికే వెళ్లిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే చాట్ షో 'కాఫీ విత్ కరణ్' ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని 7వ సీజన్ ను డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అయ్యారు.
ఈ టాక్ షోలో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలే కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రసారం కానున్న సీజన్ లో బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలు కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. దక్షిణాది ప్రేక్షకులకు కూడా ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి సెలబ్రిటీలను గెస్టులుగా ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా దక్షిణాది అగ్ర కథానాయిక సమంత 'కాఫీ విత్ కరణ్' ఏడవ సీజన్ లో పాల్గొనబోతోందట. దీని కోసమే ఆమె ముంబై వెళ్లిందని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ షోలో సామ్ ని కరణ్ జోహార్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడనే ఆసక్తికర చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఈ టాక్ షోకు వచ్చే అతిథులను కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా అడుగుతుంటారు కరణ్. ఈ విధంగానే ఎంతోమంది సెలబ్రిటీలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు ఒకవేళ అదే రీతిలో షోను నడిపిస్తే.. కచ్చితంగా సమంత విడాకుల గురించి అడిగే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.
సామ్ జీవితంలో విడిపోవడం అనేది కఠినమైన దశ కాబట్టి.. ఎక్కడికి వెళ్లినా దాని గురించి ప్రశ్నలు ఎదురవుతాయి. కరణ్ కు అక్కినేని ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉండటంతో.. డైరెక్ట్ గా కాకపోయినా ఏదొక విధంగా ఆ విషయం గురించి మాజీ కొడలి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.
దేని గురించైనా నిర్భయంగా మాట్లాడే సమంత.. ఇప్పటికే విడాకుల తర్వాత తను ఫేస్ చేసిన పరిస్థితులపై మాట్లాడింది. ఒకవేళ 'కాఫీ విత్ కరణ్' షోలో ఆ టాపిక్ వచ్చినా ఆమె సానుకూలంగా స్పందించి.. దానిపై సుదీర్ఘంగా మాట్లాడవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి కరణ్ తన షోలో సామ్ విడాకుల గురించి అడుగుతాడో లేదో వేచి చూడాలి.
ఇకపోతే డివోర్స్ తర్వాత సామ్ పూర్తిగా కెరీర్ మీదనే ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది. ఓవైపు వరుసబెట్టి సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అలానే కుర్ర హీరోయిన్లకు పోటీగా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అందాలు ఆరబోస్తూ ఎప్పటిగాలే సోషల్ మీడియాను ఊపిస్తోంది.
దీంతో విడాకుల తర్వాత ఫ్రీ మోడ్ లో ఉంది కాబట్టి దేనికైనా రెడీ అంటోందని కామెంట్స్ చేసేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోందని.. అందులో భాగంగానే ఇలాంటి ఫోటో షూట్స్ చేస్తోందని కామెంట్స్ కూడా వస్తున్నాయి.