లెజెండ్స్ బరిలో ఉన్నా? రణరంగంలోకి యువ హీరో!
విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు శ్రీవిష్ణు.
తెలుగు చిత్రసీమలో సంక్రాంతి రేసు అంటే పండుగ మాత్రమే కాదు. బాక్సాఫీస్ వద్ద విజయం కోసం జరిగే ఓ బిగ్ బాటిల్. రాబోయే సంక్రాంతి బరిలో అగ్ర కథానాయకులు, సీనియర్ లెజెండ్స్ భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎంతటి పెద్ద సినిమాలు ఎదురుగా ఉన్నా? సరైన కంటెంట్ ఉంటే పండుగ సీజన్‌లో విజయం సాధించవచ్చనే నమ్మకంతో యువ కథానాయకుడు శ్రీవిష్ణు కూడా రణరంగంలోకి దిగుతుండటం విశేషం.
విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ సంక్రాంతి రేసులో ఎంతమంది దిగ్గజాలు ఉన్నా? తన కొత్త చిత్రం `ఫ్యామిలీ ప్యాక్` తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి శ్రీవిష్ణు పూర్తి ధీమాతో సిద్ధమవుతున్నారు.
ఈ సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ అగ్ర కథానాయకులు ప్రతిష్టాత్మక చిత్రాలతో సందడి చేయనున్నారు. స్టార్ హీరోల థియేట్రికల్ కౌంట్, ఓపెనింగ్స్ చాలా భారీగా ఉంటాయి. అయితే సంక్రాంతి సీజన్ విశాలమైనది కావడంతో ఒకటి కంటే ఎక్కువ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందే అంచనా వేసిన శ్రీవిష్ణు అండ్ టీమ్, సంక్రాంతి కాంబినేషన్‌కు తగ్గట్టుగా తమ చిత్రాన్ని రంగంలోకి దించుతున్నారు.
`ఫ్యామిలీ ప్యాక్` అనే టైటిల్ సూచిస్తున్నట్లే? ఈ చిత్రం పండుగ వాతావరణానికి సరిగ్గా సరిపోయే కామెడీ, సెంటిమెంట్ కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా రూపుదిద్దుకుంటుంది. పండుగ రోజుల్లో కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి హాయిగా నవ్వుకునే సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శ్రీవిష్ణు మార్కు టైమింగ్, హస్య సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
పెద్ద సినిమాల హడావుడి ఎంత ఉన్నా? శ్రీవిష్ణు గతంలో కూడా పోటీని తట్టుకుని హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బడ్జెట్, మార్కెట్ కంటే కూడా కథలోని వినోదమే ప్రాధాన్యంగా సాగే ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఉంది. పెద్ద చిత్రాల మధ్య మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా `ఫ్యామిలీ ప్యాక్` నిలిస్తే అది బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. అయితే రిలీజ్ కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.