సుబ్బులక్ష్మి బయోపిక్ ఓకే.. మరి జానకమ్మది?
రీసెంట్ గా ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి లైఫ్ స్టోరీతో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ పేరుతో బయోపిక్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.
సినీ ప్రియుల్లో బయోపిక్స్ కు స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి లైఫ్ స్టోరీతో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ పేరుతో బయోపిక్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. సుబ్బులక్ష్మి 116వ బర్త్ డే వేళ సెప్టెంబర్ 16న చెన్నైలో ఆ మూవీని గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఆ ఈవెంట్ కు కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. సుబ్బులక్ష్మి రోల్ కోసం రష్మిక ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా చేయించుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆ అనౌన్స్మెంట్ తో ఇప్పుడు మరో గాన కోకిల జానకమ్మ బయోపిక్ ఎప్పుడనేది హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి సౌత్ సినీ వరల్డ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్. జానకి జీవితం కూడా ఒక కంప్లీట్ సినిమాకు సరిపడే కథే. అయితే ఇప్పటివరకు ఆమె జీవితంపై ఎలాంటి అఫీషియల్ బయోపిక్ ను ఏ డైరెక్టర్ లేదా ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేయలేదు. జానకమ్మ జర్నీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రేపల్లెలో పుట్టిన ఆమె.. సిరిసిల్లలో పెరిగి, ఆ తర్వాత మద్రాస్ వెళ్లి మ్యూజిక్ లవర్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
కొన్నేళ్లపాటు సౌత్ సినిమాల్లో తన వాయిస్ తో ఆడియ్సన్ ను అలరించారు. పాటలోని ఫీల్ కు తగ్గట్టు తన గొంతును మార్చడం ఆమె స్పెషాలిటీస్ లో ఒకటి. చిన్నపిల్ల నుంచి బామ్మ వరకు విభిన్న వయసుల ఫీలింగ్స్ ను గొంతులో పలికించగలిగిన టాలెంట్ ఆమె సొంతం. అలాగే జానకమ్మ సినీ జర్నీలో ఎంతోమంది సంగీత దిగ్గజాలతో మంచి రిలేషన్ ఉంది.
ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా వంటి ప్రముఖులతో కలిసి ఆమె సంగీత ప్రయాణం.. ఒక బయోపిక్ కు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారే అవకాశం ఉంది. ఆమె పర్సనల్ లైఫ్ ను పక్కనపెట్టి కేవలం మ్యూజక్ జర్నీని చూపించినా.. ఎన్నో ట్విస్టులతో కథను చెప్పొచ్చు. అయితే జానకమ్మ బయోపిక్ తెరకెక్కించాలంటే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జానకమ్మ రోల్ లో ఎవరు నటిస్తే ఆమె పర్సనాలిటీని, గాత్రంలోని ఫీల్ ను స్క్రీన్ పై సరిగ్గా చూపించగలరని వంటి విషయాలు ఉన్నాయి.
ఇప్పటికే పలువురు సంగీత దిగ్గజాల జీవితాలపై సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో.. ఫ్యూచర్ లో జానకమ్మ స్టోరీపై కూడా ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ రావచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం అలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు. ఎవరైనా డైరెక్టర్ లేదా ప్రొడక్షన్ హౌస్ జానకమ్మ లైఫ్ స్టోరీని సినిమాగా తీసుకురావడానికి ముందుకొస్తుందా అనేది వేచి చూడాల్సిందే.