నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ఎమోషనల్ సినిమా.. శ్రీకాంత్ ఓదెల క్లారిటీ!

నేచురల్ స్టార్ నాని అంటే తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.

Update: 2026-09-15 10:18 GMT

నేచురల్ స్టార్ నాని అంటే తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని త‌న సహజమైన నటనతో ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. అలాంటి నాని ఇప్పుడు తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రలతో వరుసగా సర్‌ప్రైజ్ చేస్తున్నారు. దసరా, హిట్: ది థర్డ్ కేస్ తర్వాత ది ప్యారడైజ్ తో ఆయన మరోసారి మాస్ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నాని చేతిపై కనిపిస్తున్న టాటూ, రఫ్ లుక్, సినిమాలో వినిపించే డైలాగ్స్‌ చూస్తే ఇది పూర్తిగా యూత్, మాస్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా అనే అభిప్రాయం కలగడం సహజం. అయితే ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేసే అంశం సినిమాలో ఉందంటున్నారు డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల.

ది ప్యారడైజ్ సినిమాను బయటకు చూస్తే మాస్ సినిమా లాగా కనిపించినా.. అసలు సినిమాలోని బలం మాత్రం ఎమోషన్ అని శ్రీకాంత్ ఓదెల చెబుతున్నారు. సినిమా రిలీజైన తర్వాత ఆడియ‌న్స్ ఎక్కువగా మాట్లాడుకునేది నాని మాస్ లుక్ గురించి కాదని, కథలోని ఎమోష‌న్స్ గురించేన‌ని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తల్లి, కొడుకుల మధ్య ఉండే బంధాన్ని సినిమాలో నెక్ట్స్ లెవెల్‌లో చూపించార‌ని ది ప్యార‌డైజ్ సినిమాలో విల‌న్ గా న‌టించిన రాఘవ్ జుయల్ వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు సినిమాపై ఉన్న యూత్ మూవీ అనే ట్యాగ్‌కు భిన్నంగా ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఈ కథలో కీలకంగా ఉండబోతుందనే ఆసక్తి పెరుగుతోంది.

నాని కెరీర్‌ను గమనిస్తే ఆయన ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. జెర్సీ లో సున్నితమైన ఎమోష‌న్స్ ను పండించిన నాని.. ఆ తర్వాత హాయ్ నాన్నతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను కదిలించారు. అలాంటి నానినే ఇప్పుడు ది ప్యారడైజ్ లో ఇంత రఫ్ అండ్ మాస్ షేడ్స్‌లో కనిపిస్తుండటం ఫ్యాన్స్ కు కూడా ఊహించని మార్పే. నాని ఆడియ‌న్స్‌నే కాకుండా అప్పుడప్పుడు తనను తాను కూడా సర్‌ప్రైజ్ చేసుకుంటూ ఉంటార‌ని రాఘ‌వ్ జుయ‌ల్ పేర్కొన్నారు.

అందుకే ది ప్యారడైజ్ విషయంలో అసలు ప్రశ్న నాని మాస్ లుక్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? అనే దానికంటే ఆ మాస్ ప్రపంచం వెనుక దాగి ఉన్న ఎమోషన్‌ను నాని ఏ స్థాయిలో ఆడియ‌న్స్ కు చేరువ చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ తర్వాత నాని కొత్త ఇమేజ్‌ కంటే.. సినిమాలోని ఎమోష‌నే మెయిన్ డిస్క‌ష‌న్ గా మారుతుందా అనేది చూడాలి.




Tags:    

Similar News