మెరూన్ గౌన్‌లో మెరిసిన భాగ్యశ్రీ.. SIIMAలో గ్లామర్ హైలైట్!

సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సైమా (SIIMA 2026) అవార్డ్స్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Update: 2026-09-15 11:26 GMT

సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సైమా (SIIMA 2026) అవార్డ్స్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుల్కర్ సల్మాన్ సరసన 'కాంతా' సినిమాలో 'కుమారి'గా అద్భుత నటన కనబరిచినందుకు గానూ ఆమె 'బెస్ట్ ఆక్ట్రెస్ (క్రిటిక్స్)' అవార్డును దక్కించుకున్నారు. రాయల్ మరూన్ కలర్ గౌన్‌లో అవార్డు పట్టుకుని ఆమె ఇచ్చిన క్యూట్ పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..




 


రాయల్ మరూన్ గౌన్‌లో భాగ్యశ్రీ విజువల్ ట్రీట్! :

సైమా అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై భాగ్యశ్రీ బోర్సే ధరించిన మరూన్ కలర్ ఆఫ్-షోల్డర్ మెలోడీ గౌన్ అందరినీ కట్టిపడేసింది. వెల్వెట్, శాటిన్ మిశ్రమంతో రూపొందించిన ఈ బాడీ కాన్ గౌన్ ఆమెకు మరింత ఎలిగెంట్ లుక్‌ని ఇచ్చింది. ఇక గౌన్‌కు ఉన్న డ్రామాటిక్ థై-హై స్లిట్ మరియు నడుము వద్ద ఉన్న డిజైన్ ఆమె గ్లామర్‌ను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లింది.




 


పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ :

ఈ రాయల్ అవుట్‌ఫిట్‌కి తగ్గట్టుగా భాగ్యశ్రీ తన హెయిర్‌ను హై కర్లీ పోనీటెయిల్‌గా కట్టారు. సాఫ్ట్ గ్లామ్ మేకప్‌తో పాటు చాలా సింపుల్ జ్యువెలరీని ఎంచుకోవడంతో ఆమె రూపురేఖలు మరింత ప్రశాంతంగా, మెరిసిపోయేలా కనిపించాయి. చేతిలో సైమా వేదిక పైన చిరునవ్వులు చిందిస్తూ ఆమె ఇచ్చిన పోజులు వేడుకకే ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.




 


సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూకుడు!:

'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ, ఆ తర్వాత విజయ్ దేవరకొండతో 'కింగ్‌డమ్', తమిళంలో 'కాంతా' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంది. ఇటీవల అఖిల్ అక్కినేని సరసన 'లెనిన్' మూవీ తో మరో బ్లాక్ బాస్టర్ ను తన సొంతం చేసుకున్నారు. ఇక తమిళంలో 'సేయోన్', మరియు మలయాళంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో 'ఆపరేషన్ గంగ' చిత్రాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.




 


తక్కువ సమయంలోనే భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన నటిస్తూ, ప్రతిభతో పాటు అవార్డులను కూడా గెలుచుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే రాబోయే రోజుల్లో టాలీవుడ్, కోలీవుడ్‌లలో మరింత పెద్ద స్టార్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News