బిగ్ బాస్ 'హోస్ట్'గా కమల్ ప్రయాణం ముగియనుందా..??

Update: 2021-06-14 16:30 GMT
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. షోను రెగ్యులర్ గా చూసేవారు చూడనివారు అంతా కూడా 5వ సీసన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అంతలా హైప్ క్రియేట్ చేస్తున్న ఈ బిగ్ బాస్ షోను తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. ఇంకా తమిళ బిగ్ బాస్ పై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తాజాగా తమిళ బిగ్ బాస్ షోకు సంబంధించి సోషల్ మీడియాలో.. కోలీవుడ్ వర్గాలలో పలు చర్చలు నడుస్తున్నాయి. ఏంటంటే.. ఈసారి కమల్ హాసన్ హోస్ట్ చేస్తారా లేదా అని.

కానీ తాజా సమాచారం ప్రకారం.. తమిళ బిగ్ బాస్ -5 హోస్ట్ గా కమల్ హాసన్ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ 2017లో ప్రారంభం అయింది. అప్పటినుండి కమల్ హోస్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి 5వ సీసన్ తో కమల్ హోస్ట్ గా లాస్ట్ టైం రానున్నట్లు టాక్. లేటెస్ట్ టాక్ బట్టి తమిళ బిగ్ బాస్ యాజమాన్యంతో కమల్ హాసన్ 5 సంవత్సరాలకు మాత్రమే కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. అందుకే కమల్ ఈసారి 5వ సీసన్ తో చివరిసారి హోస్ట్ చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో కమల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అయితే కమల్ ఎప్పుడైతే బిగ్ బాస్ హోస్ట్ గా మొదలుపెట్టారో.. అప్పటినుండి ఆయనకు వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా సహాయపడినట్లు తెలుస్తుంది. చాలకాలం తర్వాత కమల్ కు బిగ్ బాస్ సినిమాలకంటే ఎక్కువగా ప్లస్ అయినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే కమల్ రాజకీయాల్లో ఓటమి చవిచూసాడు. అందుకే ఓ వైపు రాజకీయాలు కంటిన్యూ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కమల్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఇండియన్-2 మూవీ వివాదంలో చిక్కుకొని ఉంది. ఆ సినిమా కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. వీటితో పాటు శభాష్ నాయుడు మూవీ కూడా లైన్ లో ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి త్వరలో బిగ్ బాస్ పై క్లారిటీ ఇస్తాడేమో!
Tags:    

Similar News