సంక్రాంతి రేసు.. 'రాజా సాబ్' పోరాడాల్సిందేనా?

హారర్ కామెడీ ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. జనవరి 9వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయింది. చెప్పాలంటే ఆ చిత్రంతో 2026 సినీ సంక్రాంతి స్టార్ట్ కూడా అయింది.;

Update: 2026-01-15 16:45 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారర్ కామెడీ ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. జనవరి 9వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయింది. చెప్పాలంటే ఆ చిత్రంతో 2026 సినీ సంక్రాంతి స్టార్ట్ కూడా అయింది. రిలీజ్ కు ముందు ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసుకున్న రాజా సాబ్.. గ్రాండ్ గా విడుదలైంది.

మారుతి దర్శకత్వం వహించిన ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అంతే కాదు.. మూవీని ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. సరైన ప్లాన్ తో ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేశారు. వాటితో ఆడియన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో సినిమా కోసం అటు అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎంతో వెయిట్ చేశారు.

అయితే బ్లాక్ బస్టర్ హిట్ గా సినిమా నిలుస్తుందని అంతా అనుకుంటే.. మిక్స్ డ్ టాక్ కే పరిమితమైంది. ప్రభాస్ యాక్షన్ ను అంతా కొనియాడుతుంటే.. మారుతిపై ఫైర్ అవుతున్నారు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు. కథ విషయంలో ఇంకా కసరత్తు చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఏదేమైనా రాజా సాబ్ మూవీ.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిపోయింది.

అదే సమయంలో ప్రభాస్ ఇమేజ్ వల్ల మేకర్స్ చెప్పిన లెక్కల ప్రకారం, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నట్లే. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకునేందుకు పోరాడాల్సిందేనని తెలుస్తోంది. ఎందుకంటే రాజా సాబ్ మూవీతో పాటు సంక్రాంతికి రిలీజ్ అయిన మిగతా నాలుగు సినిమాలు అందరినీ అలరిస్తున్నాయి. సినీ ప్రియులు థియేటర్స్ కు రప్పిస్తున్నాయనే చెప్పాలి.

చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫుల్ గా ఆకట్టుకుంటోంది. దీంతో ఆ సినిమాకు స్క్రీన్లు సరిపోక.. మిడ్ నైట్ షోలు వేస్తున్నారు. అదే సమయంలో రవితేజ లీడ్ రోల్ పోషించిన భర్త మహాశయులకు విజ్ఞప్తికి బి అండ్ సి సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. ఓవరాల్ గా యావరేజ్ రెస్పాన్స్ తో సందడి చేస్తోంది.

నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు.. మంచి రివ్యూలు, రెస్పాన్స్ లతో దూసుకుపోతున్నాయి. దీంతో ఇప్పుడు రాజా సాబ్ తప్ప సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తుంది. రాజా సాబ్ కూడా అనుకున్నట్లు ఉండి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఏం చేయలేం. ఏదేమైనా రాజా సాబ్ మూవీ ఫైనల్ రన్ లో ఎంతలా రాబడుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News