గ్లామర్ తో హీటెక్కిస్తున్న రకుల్.. ఆ ఫోజులకే ఫిదా!

హీరోయిన్స్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో తమ అందంతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు.;

Update: 2026-01-15 16:50 GMT

హీరోయిన్స్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో తమ అందంతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అంతేకాదు ఫాలోవర్స్ లో పెంచుకున్న తర్వాత పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ అలా కూడా ఆదాయాన్ని పొందుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఫాలోవర్స్ పెరగాలంటే రోజుకు ఒక గ్లామర్ ట్రీట్ ఇవ్వాల్సిందే అనే రేంజ్ లో ప్రస్తుతం ట్రెండ్ నడుస్తోంది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. మరోవైపు ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పటికీ.. మరోవైపు అభిమానులకు చేరువ అవ్వడానికి నిత్యం ఫోటోషూట్ తో ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.




బ్లాక్ కలర్ లెహంగా ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్ లో సిల్వర్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఒక కోట్ ధరించి.. తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. ముఖ్యంగా గార్జియస్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చి మరింత అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన మెడను ప్రత్యేకంగా డిజైన్ చేసిన జువెలరీ తో ఫుల్ ఫిల్ చేసుకుంది. ఇక మత్తెక్కించే కళ్ళతో.. మరింత అందంగా ముస్తాబయింది. తాజాగా ఓవర్ లోడెడ్ గ్లామర్ డోస్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది . అదిరిపోయే ఫోజులు ఇవ్వడంతో ఆ ఫోజులకే ఫిదా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. కెరటం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. "ప్రార్ధన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ" అనే డైలాగ్ తో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా తర్వాత లౌక్యం, కరెంటు తీగ , కిక్ 2 , పండగ చేసుకో, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక , స్పైడర్ ఇలా పలు తెలుగు చిత్రాలలో పలువురు స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది.




ఇక తెలుగులో నాగార్జున సరసన మన్మధుడు 2 సినిమాలో నటించి విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. ఆ తర్వాత చెక్ సినిమాలో నటించి డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈమె నటించిన ఎన్నో సినిమాలు ఈమెకు పెద్దగా విజయాన్ని అందించలేదు. దీంతో బాలీవుడ్ కి మకాం మార్చేసింది. అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన రకుల్ ప్రముఖ నటుడు , నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఏడడుగులు వేసింది. ఇక ప్రస్తుతం తన భర్తతో కలిసి హైదరాబాదులోనే నివసిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Tags:    

Similar News