అందాల ఆషిక.. ఇప్పుడు ఆమెనే యూత్ డ్రీమ్ గర్ల్!

వివిధ కన్నడ చిత్రాలతో మెప్పించిన బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డెబ్యూతో అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి.;

Update: 2026-01-15 16:45 GMT

టాలీవుడ్ యూత్ ఫోకస్ పడిన బ్యూటీల్లో ఇప్పుడు అందాల ఆషిక రంగనాథ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, క్రమంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. వివిధ కన్నడ చిత్రాలతో మెప్పించిన బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డెబ్యూతో అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి.

ఆ తర్వాత కింగ్ నాగార్జున లీడ్ రోల్ పోషించిన నా సామి రంగ సినిమాతో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆషిక.. ఈ సంక్రాంతికి విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. మూవీలో ప్రత్యేకమైన పాత్రలో, వివాహితుడైన హీరోకి గర్ల్‌ఫ్రెండ్‌ గా ఆషిక కనిపించారు. స్టోరీ పరంగా సున్నితమైన పాత్ర అయినప్పటికీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమా మొత్తంలో ఆమె పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్, గ్లామర్‌ తో పాటు క్యారెక్టర్ ఫ్రెష్‌ నెస్‌ ను కూడా చూపించడంతో.. మూవీ రిలీజ్ అయ్యాక ఆమె కోసం జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌ లో ఒకేసారి పలు చిత్రాలు పోటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆషిక నటనపై ప్రత్యేకంగా మాట్లాడుకోవడం విశేషం. సోషల్ మీడియాలో ఆమె కోసమే డిస్కషన్లు జరుగుతున్నాయి.

ప్రస్తుతం నెట్టింట ఆషిక ఫోటో షూట్లు, సినిమా క్లిప్పులు వైరల్ కావడం, ఫ్యాన్ పేజీలు పెరగడం చూస్తే, టాలీవుడ్‌ యాత్ డ్రీమ్ గర్ల్ ఆమెనే అని అనిపిస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కథలో పెద్ద ఎమోషనల్ సీన్లు లేకపోయినా, తన పాత్ర పరిధిలో అమ్మడు ఆకట్టుకునేలా కనిపించిందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. చాలా బాగా నటించారని అంతా కొనియాడుతున్నారు.

అదే సమయంలో యాక్టింగ్ పరంగా ఇంకాస్త డెవలప్ అయితే ఇంకా సూపర్ అని అంటున్నారు. డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఇంకా మెళకువలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడు ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా స్ట్రాంగ్ యాక్ట్రెస్ గా సత్తా చాటవచ్చని, భారీ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. తద్వారా స్టార్ హీరోయిన్ గా మారగలరని అంటున్నారు.

ఇక ఆషిక రంగనాథ్ అప్ కమింగ్ చిత్రాలపై కూడా అందరి దృష్టి పడింది. మరికొద్ది రోజుల్లో ఆమె విశ్వంభర సినిమాతో థియేటర్స్ లోకి రానున్నారు. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీ.. సమ్మర్ లో విడుదల కానుంది. అదే సమయంలో కోలీవుడ్ హిట్ మూవీ సర్దార్ సీక్వెల్ కూడా ఆమె చేతిలో ఉంది. మరి తన కొత్త సినిమాలతో ఆషిక ఎలా మెప్పిస్తారో.. ఫ్యూచర్ లో ఎంతటి బెస్ట్ స్టేజ్ కు రీచ్ అవుతారో వేచి చూడాలి.

Tags:    

Similar News