పండుగ పూట సాంప్రదాయంగా ఆకట్టుకుంటున్న ప్రభాస్ బ్యూటీ..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది హీరోయిన్స్ తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాలో బిజీగా మారిపోతున్నారు.;
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది హీరోయిన్స్ తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాలో బిజీగా మారిపోతున్నారు. అందులో భాగంగానే వరుస గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మరింత సాంప్రదాయంగా ముస్తాబయి.. అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పండుగ పూట సాంప్రదాయంగా ముస్తాబయి అందరి హృదయాలను దోచుకుంటోంది ప్రభాస్ బ్యూటీ మాళవిక మోహనన్.
మలయాళ చిత్రాల ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తొలిసారి తెలుగులో ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ కెరియర్ లోనే తొలి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే నాలుగు రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఇందులో తన నటనతో అభిమానులను మెప్పించింది.
ఇకపోతే ఈరోజు సంక్రాంతి పండుగ కావడంతో పండుగను పురస్కరించుకొని మరింత అందంగా తయారయింది మాళవిక మోహనన్. సాంప్రదాయంగా పింక్ కలర్ పట్టుచీర కట్టుకున్న ఈమె.. చేతిలో తామర పువ్వును పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. కళ్ళతో మైమరిపిస్తూ మాయ చేస్తూ అభిమానుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం మాళవిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈమె అందానికి ఫిదా అవుతూ అలాగే ఈమెకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు.
అలాగే మాళవికకి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ది రాజాసాబ్ సినిమా ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలో తన మొదటి ఫ్రెండు ఒక స్టార్ హీరో అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మాళవిక మాట్లాడుతూ.. విక్కీ కౌశల్ నా పాత స్నేహితుడు మాత్రమే కాదు నా జీవితంలో అలాగే ఇండస్ట్రీలో మొదటి స్నేహితుడు కూడా అంటూ చెప్పుకొచ్చింది. ముంబైలో ఇరుగుపొరుగున పెరిగిన వీరు చిన్నప్పటినుంచి కలసి ఆడుకునేవారట. ఇదే విషయాన్ని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
మాళవిక మాట్లాడుతూ.." ఏడాది పాపగా ఉన్నప్పటి నుంచే నాకు విక్కీ తెలుసు. అప్పట్లో విక్కీకి సుమారుగా 6 సంవత్సరాలు ఉంటాయేమో. మేము ఇప్పటికీ కూడా కలుస్తూనే ఉంటాము. మా అమ్మ చేసే మలయాళీ వంటలంటే విక్కికి ఎంతో ఇష్టం. ఆ భోజనం తింటూ కబుర్లు చెప్పుకుంటాం తప్ప.. మేము ఎప్పుడు కెరియర్ గురించి చర్చించుకోలేదు. ఇక విక్కీ హీరోగా మారుతాడో లేదో అప్పట్లో నాకు తెలిసేది కాదు కానీ అతని డాన్స్ కు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉండేది" అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది మాళవిక. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి