అబ్బాయ్.. బాబాయ్ ని బుక్ చేశాడా...?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా తారలు సరికొత్త ఛాలెంజ్ లతో లాక్ డౌన్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు టాలీవుడ్ లోని చాలా మంది సినీ స్టార్స్ ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు లాక్ డౌన్ కారణంగా రావడం మానేశారు. దీంతో స్టార్స్ ఎప్పుడు లేని విధంగా ఇళ్ళల్లో నడుము వంచి పని చేస్తున్నారు. ఇక ఇప్పుడు #BeTheRealMan అనే హ్యాష్ ట్యాగ్ తో స్టార్స్ ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన సవాలుని పూర్తి చేసిన జక్కన్న.. ఎన్టీఆర్ రామ్ చరణ్ లను నామినేట్ చేసాడు. కాగా దర్శకధీరుడు రాజమౌళి విసిరిన ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ని హీరో ఎన్టీఆర్ పూర్తి చేశారు. ఇంటి పనుల్లో భార్యకు సాయం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను తారక్.. ట్విటర్ లో పోస్ట్ చేశారు.. ఇది జక్కన్న కోసం అని పేర్కొన్నారు. అంతేకాకుండా 'మన ఇంట్లో ప్రేమలు - అప్యాయతలే కాదు.. పనులను కూడా పంచుకుందామని' పిలుపునిచ్చారు. మనం చేసిన పనులను ఇతరులతో షేర్ చేయడం చాలా ఫన్ గా ఉంటుందన్నారు. బాలా బాబాయ్ - మెగాస్టార్ చిరంజీవి - నాగార్జున బాబాయ్ - వెంకటేష్ గారు - అలాగే డైరెక్టర్ కొరటాల శివ గారి కోసం ఈ ఛాలెంజ్.. అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే కొరటాల - మెగాస్టార్ ఛాలెంజ్ స్వీకరించారు చేశారు కూడా. అయితే మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. అబ్బాయ్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌కు బాబాయ్ బాలయ్య స్పందిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య గురించి ఎంత ప్రస్తావించినా ఇంతవరకు బాలకృష్ణ.. తారక్ గురించి పెద్దగా స్పందించింది లేదు. అంతేకాకుండా ఎన్నో రోజులుగా బాబాయ్ - అబ్బాయ్ మధ్య సంబంధాలు సరిగా లేవని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కుటుంబ సంబంధమైన విషయాలతో పాటు కొన్ని రాజకీయ విషయాల్లో కూడా ఈ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఎన్నోసార్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఈ వార్తలను పట్టించుకోకుండా ‘బాలా బాబాయ్’ అంటూ ప్రేమగా పిలుస్తూ... బాలయ్యనే ముందుగా ఈ ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. ఎన్టీఆర్ ఛాలెంజ్ కు బాలకృష్ణ స్పందిస్తే కనుక నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని చెప్పవచ్చు. కానీ బాలయ్య ఎన్టీఆర్ ఛాలెంజ్ ని కేర్ చేస్తాడా లేదా అనేది ఇక్కడ చాలా మంది అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. బాలయ్య ఆ సవాలును పట్టించుకోకపోతే వాళ్ళిద్దరికి అసలు పడట్లేదనే అందరు కన్ క్లూజన్ కి వచ్చేస్తారు అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. ఈ ఛాలెంజ్ ను బాలయ్య స్వీకరించి ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ సారి బాలయ్య ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ గురించి ఏమైనా ఆలోచిస్తాడేమో చూడాలి.