• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శృతి మాటలు నమ్మొచ్చా

శృతి మాటలు నమ్మొచ్చా

By - Tupaki Desk
Update: 2018-01-27 11:06 GMT
నాలుగేళ్ల క్రితం గబ్బర్ సింగ్ దెబ్బకు ఒక్క సినిమాతో స్టార్ హీరొయిన్ అయిపోయిన శృతి హాసన్ ఈ మధ్య సినిమాల్లో బొత్తిగా కనిపించడం మానేసింది. లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ తో చేసిన కాటమ రాయుడు డిజాస్టర్ కావడమే కాక హీరొయిన్ అయిన తన మీద విమర్శలు ఎక్కువ రావడం పట్ల శృతి కొంచెం కినుకుగా ఉంది. దాని తర్వాత మాత్రం ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. నటి ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్.సి భారీగా తలపెట్టిన సంఘమిత్ర సినిమాకు ముందు ఎస్ చెప్పి ఆ తర్వాత తప్పుకున్న శృతి హాసన్ దాని వల్ల కొంత వివాదంలో ఇరుక్కున్న విషయం ఫాన్స్ ఇంకా మర్చిపోలేదు. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టే వదిలేసాను అని చెప్పిన శృతి వెర్షన్ తో దర్శక నిర్మాతలు విభేదించినప్పటికీ అది ఇప్పుడు గతం. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో అసలు తాను ఎందుకు సినిమాలు చేయటం లేదో చెప్పే ప్రయత్నం చేసింది శృతి హాసన్.

గతంలో తాను ఒప్పుకుని చేసిన కొన్ని సినిమాలు ప్రొడక్షన్ స్టేజిలో ఉన్నప్పుడే ఇవి ఎందుకు ఒప్పుకున్నానా అని ఫీల్ అయ్యానని, తర్వాత చేయకపోయి ఉంటే బాగుండేది అని అనిపించిందని, అందుకే తొందరపడి ఏ సినిమాలు సైన్ చేయటం లేదని చెప్పింది. నిజానికి శృతికి గతంలో ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. కొత్త హీరొయిన్ల తాకిడి సౌత్ లో ఉన్న అన్ని బాషా సినిమాల్లో ఎక్కువగా ఉండటంతో సీనియర్ అయిన తనకు ఎవరు పెద్దగా ఆఫర్స్ ఇవ్వడం లేదు. కాని శృతి చెబుతోంది మాత్రం మరోలా ఉంది.

చేతిలో సినిమాలు ఏవి లేకపోయినా శృతి హాసన్ నటించిన ఒక్క సినిమా మాత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదే శభాష్ నాయుడు. నాన్న కమల్ హాసన్ తో ఆయన కూతురిగా రియల్ లైఫ్ పాత్ర పోషించిన శృతి ఆ షూటింగ్ సమయంలోనే గౌతమి తో గొడవ పడిందనే వార్తలు జోరుగా షికారు చేసాయి . ఆ తర్వాత కొంత కాలానికి కమల్-గౌతమి పూర్తిగా విడిపోయారు. దీంతో తనకు సంబంధం లేదని శృతి హాసన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కోలీవుడ్ మీడియాలో దీని గురించి గుసగుసలు కొనసాగుతూనే ఉన్నాయి. 
Tags:    
  • Shruti Haasan 
  • Actress Shruti Haasan 
  • Telugu NEws 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS