• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్ రెండుసార్లు ప్రేమలో...

నయన్ రెండుసార్లు ప్రేమలో ఎందుకు విఫలమైంది...?

By - Tupaki Desk
Update: 2020-04-16 17:49 GMT
సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో కొన్నేళ్లుగా తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది నయనతార. ఆమె సినీ కెరీర్ పక్కన పెడితే ప్రేమాయ‌ణాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికి రెండు సార్లు ప్రేమ‌లో విఫ‌ల‌మైన న‌య‌న్ ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ప్రేమ‌లో ఉంది. ముందుగా కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో ప్రేమాయణం సాగించింది ఈ అమ్మడు. కానీ ఆ బంధం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ ప్రభుదేవాని లవ్ లోకి దింపింది. డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా - నయనతార మధ్య అఫైర్ వ్యవహారం అప్పట్లో చిత్ర పరిశ్రమను కుదిపేసింది. వారిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. నయనతార కోసం ప్రభుదేవా తన దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పి మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చేసాడు. ఒకానొక సమయంలో ప్రభుదేవా కోసం నయనతార సైతం సినిమాలకు కూడా గుడ్ బై చెప్పాలనుకుంది. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లి చేసుకుంటార‌నే వ‌ర‌కు వెళ్లిన వీరి ప్రేమ బ్రేక‌ప్ అయింది. పెళ్లి వరకు వచ్చిన వారి రిలేషన్‌షిప్‌కు అర్ధాంతరంగా బ్రేక్ పడటం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

రీసెంటుగా ప్రభుదేవా మాజీ భార్య నయనతార మీద ఫైర్ అయ్యారట. తన కాపురంలో నిప్పులు పోషిందని శాపనార్థాలు పెట్టిందట. ఈ నేపథ్యంలో మరోసారి వీరి ప్రేమాయణం వార్తల్లో నిలిచింది. ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయన్ మాట్లాడుతూ.. నేను రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో నా వంతుగా నేను వంద శాతం సహకారం అందించాను. రిలేషన్‌షిప్ బలమైన బంధంగా మారడానికి నా వంతు బాధ్యతను నేను అందించాను. అది నాకు మంచి ఫలితాలు ఇవ్వకపోతే నా తప్పు కాదు. నా జీవితానికి మంచి జరగనప్పుడు ఆ బంధాన్ని నేను ఎందుకు భరించాలి' అంటూ చెప్పుకొచ్చిందట. 'మూడున్నర ఏళ్లపాటు నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కానీ ఆ బంధాన్ని అంత త్వరగా తెంచుకోవడం సాధ్యం కాకపోయినా వాస్తవాన్ని గ్రహించాలి' అంటూ నయనతార ఆవేదన చెందారట.

అంతేకాకుండా 'ఒకరిపై మరొకరికి నమ్మకం లేనప్పుడు కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మేలని.. రెండు సార్లు తన ప్రేమ విఫలం కావడానికి ఇదే కారణమని.. న‌మ్మకాలు విఫ‌ల‌మ‌వ్వ‌డంతోనే త‌న తొలి రెండు బంధాలు తెంచుకున్నాన‌ని.. ఆ స‌మ‌యంలో తాను ఎంత బాధ అనుభ‌వించానో త‌న‌కే తెలుస‌ని' వివరించిందట. ఏదేమైనా రెండు లవ్ స్టోరీల బ్రేక్ అప్ తర్వాత ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రిలేషన్‌షిప్ లో ఉంది నయన్. కోలీవుడ్ డైరెక్టర్ సంతోష్ శివన్ తో నయన్ మూడేళ్ళుగా ప్రేమాయణం సాగిస్తోంది. మరి అమ్మడు ఈ రిలేషన్‌షిప్ అయినా పెళ్లి పీటల దాకా తీసుకెళ్తుందో లేదో చూడాలి.



Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS