అతిలోక సుందరిని తీసుకువచ్చేదెలా?
మెగాస్టార్ చిరంజీవి.. శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' విడుదలై రేపటికి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంటుంది. క్లాసిక్ స్టేటస్ తెచ్చుకున్న ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉందని నిర్మాత అశ్విని దత్ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ వార్తపై పడింది.
ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చెయ్యడం అంత సులువేమీ కాదు. ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో కుదిరితే ఎలా ఉంటుందో ఈ సినిమా సరిగ్గా అలా ఉంటుంది. ఈ సినిమాలో ఏ అంశాన్ని తక్కువ చెయ్యలేం. ఇలాంటి సినిమాను భుజాలపై మోసేందుకు మెగాస్టార్ కంటే ది బెస్ట్ కమర్షియల్ హీరో ఎవరుంటారు? సోషల్ ఫ్యాంటసీ కథ.. డైలాగ్స్.. నటీనటుల నటన.. మ్యూజిక్.. డైరెక్షన్..నిర్మాణ విలువలు.. విజువల్ ఎఫెక్ట్స్.. ఫైట్స్.. అన్నీ అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ఇక శ్దేరీవి అయితే నిజంగా దివి నుంచి భువికి దిగొచ్చిన దేవతలాగానే కనిపించింది. చిరును ముద్దుగా 'మానవా' అని పిలిచినా.. వంకాయను చూసి "దీనిని ఏమందురు?" అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురైనా ఆ నటన.. ఆ ఎక్స్ ప్రెషన్లు మరొకరికి అసాధ్యం అన్నట్టుగా ఉంటాయి. యాక్టింగ్ ఎవరైనా చేస్తార్రేమో కానీ అతిలోక సుందరిగా కనిపించడం మాత్రం శ్రీదేవికి తప్ప మరొకరికి వీలు కాదు అన్నట్టుగా ఉంటుంది ఆ పాత్ర.
సీక్వెల్ కనుక తీస్తే అన్నీ అంశాల్లో ఇంచుమించుగా రిప్లేస్ మెంట్ ఉంటుందేమో కానీ శ్రీదేవికి రీప్లేస్ మెంట్ మాత్రం అత్యంత కష్టమైన విషయం అని నెటిజన్లు అంటున్నారు. అందం.. నటన.. గ్రేస్ ఇలా అన్ని విషయాల్లో టాప్ రేంజ్ లో ఉంటే తప్ప ఆ పాత్రను పోషించలేరని అంటున్నారు. మరి మోడరన్ అతిలోక సుందరి ఎక్కడ ఉందో ఏమో!