• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజినీ కి పోటీగా ఎవరు...

రజినీ కి పోటీగా ఎవరు వస్తారు..?

By - Tupaki Desk
Update: 2021-07-03 06:43 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''అన్నాత్తే''. మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ - మీనా - ఖుష్బూ - ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - రోబో శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కరోనా సెకండ్ వేవ్ రాకముందు ప్రకటించారు. అయితే లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలన్నీ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో.. రజనీ నటిస్తోన్న 'అన్నాత్తే' కూడా చెప్పిన తేదీకి రావడం కష్టమేనని అందరూ అనుకున్నారు.

ఈ నేపథ్యంలో రజినీకాంత్ కెరీర్ లో 168వ చిత్రంగా వస్తున్న 'అన్నాత్తే' ను ముందుగా చెప్పినట్లుగానే నవంబరు 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దీపావ‌ళి లోపు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే అవ‌కాశం ఉండ‌టంతో రజ‌నీ ముందుగానే ఫెస్టివల్ సీజ‌న్ లో రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ కు పోటీగా దీపావ‌ళి సీజ‌న్ మీద ఎవరు క‌ర్చీఫ్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
 
కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే రిలీజ్ చేయాలని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో మరికొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. ఒక్కసారి సిచ్యుయేషన్ నార్మల్ అయితే ఒకదాని తర్వాత ఒకటి థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంటుంది. అందుకే రజినీకాంత్ కు కూడా సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో రజినీని ఢీ కొట్టడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి.

కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ 'అన్నాత్తే' చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. వెట్రి పలనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనే రజినీ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Tags:    
  • annatthe movie 
  • annatthe movie release date 
  • Rajinikanth 
  • Rajinikanth Movie Shooting 
  • Rajinikanth Movie Updates 
  • Kollywood Movies 
  • Kollywood Shootings 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS