జయ బయోపిక్: టైటిల్ రోల్ ఎవరిది?

Update: 2018-09-22 11:38 GMT
తమిళంలో కూడా బయోపిక్ జోరు షురూ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి 'అమ్మ' జయలలిత పై రానున్న అరడజను బయోపిక్ ల పై ఉంది.  ఇప్పటికే  ఏయల్‌ విజయ్.. జె జె ప్రియదర్శిని.. భారతీరాజా.. ఆదిత్య భరద్వాజ్ లు ఇప్పటికే 'అమ్మ' బయోపిక్ ను టేకప్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.  వీరు కాకుండా మరి కొంతమంది కూడా అమ్మ బయోపిక్ ను రూపిందించే ప్రయత్నాలలో ఉన్నారట.

ఇక అందరికంటే ముందుగా జె జె ప్రియదర్శిని 'ది ఐరన్ లేడీ' పేరుతో జయ బయోపిక్ ను అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది.  ఈ ప్రాజెక్టుకు ప్రీ-ప్రొడక్షన్ చెన్నైలో జోరుగా సాగుతోందట. ఇక ఈ సినిమాలో జయలలిత పాత్రను ఎవరు పోషిస్తారా అని అసక్తిగా ఎదురుచూస్తున్నారు.  జయ పాత్రకు నిత్య మీనన్.. వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారట.

పర్సనాలిటీ వైజ్.. యాక్టింగ్ వైజ్ చూస్తే జయలలిత పాత్రకు నిత్య మీనన్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఎక్కువమంది అభిప్రాయం. వచ్చే నెలలో గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి సినిమాకు పనిచేసే నటీనటులు... టెక్నిషియన్స్ డీటెయిల్స్ ప్రకటిస్తారట.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా రెగ్యులర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Tags:    

Similar News