మాస్ మహారాజ్ ప్లేస్ లోకి యాక్షన్ హీరో వచ్చి చేరాడా..?

Update: 2020-12-25 06:23 GMT
మాస్ మహారాజ్ రవితేజ - డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందని చాలా రోజులుగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో తెరకెక్కే ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడని.. గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని కూడా సినీ జనాలు చెప్పుకున్నారు. అయితే ఫిలిం సర్కిల్స్ లో లేటెస్టుగా నడుస్తున్న టాక్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నాడట. రెమ్యూనరేషన్ దగ్గర నిర్మాతలకు హీరోకి కుదరకపోవడంతో ఇప్పుడు రవితేజ ప్లేస్ లోకి మరో హీరో వచ్చి చేరాడని అనుకుంటున్నారు. ఈ పాత్ర కోసం సరైన హీరో కోసం చూసిన మారుతి అండ్ జీఏ2 ప్రొడక్షన్స్ వారు చివరకు యాక్షన్ హీరో గోపీచంద్ తో సంప్రదింపులు జరిపారట.

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా తో కలిసి 'సీటీమార్' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న గోపీచంద్.. మారుతి స్క్రిప్ట్ కి ఓకే చెప్పేసాడట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. కాగా, గతేడాది సాయి ధరమ్ తేజ్ హీరోగా 'ప్రతిరోజూ పండగే' సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న మారుతి.. అప్పటినుంచి మరో సినిమా అనౌన్స్ చేయలేదు. రవితేజ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసి ఇప్పుడు గోపీచంద్ తో వెళ్తున్నాడు. మరోవైపు రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. అలానే 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మతో 'ఖిలాడీ' అనే యాక్షన్ థ్రిల్లర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
Tags:    

Similar News