• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నెంబ‌ర్ వ‌న్ ప్లేస్...

నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ ఎవ‌రికి సొంతం అవుతుందో..!

By - Tupaki Desk
Update: 2020-12-15 13:30 GMT
సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతూ ఉంటుంది. గ్లామర్ వరల్డ్ లో ఈ పోటీని తట్టుకుని నిలదొక్కుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. ఈ క్రమంలో రేసులోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చి పోతుంటారు. కొందరు అందం అభినయంతో గుర్తింపు తెచ్చుకోగా.. మరికొందరు ఒకటి రెండు సినిమాతోనే సరిపెట్టుకొని వెళ్లిపోతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ అర డజను మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వీరి తర్వాత జెన‌రేష‌న్ హీరోయిన్లలో నెంబర్ వన్ ప్లేస్ కోసం చాలా మంది పోటీపడుతున్నారు. వరుస అవకాశాలతో పాటు వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ లిస్టులో ముందుగా సాయిప‌ల్లవి గురించి చెప్పుకోవచ్చు. 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న సాయి పల్లవి.. ప్రస్తుతం 'లవ్ స్టోరీ' 'విరాటపర్వం' చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

'భరత్ అనే నేను' సినిమాతో తెలుగులో పరిచయమైన కియారా అద్వానీ.. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుంది. రెండో సినిమా ప్లాప్ అయినప్పటికీ అమ్మడి క్రేజ్ కి ఏమాత్రం డోకా లేదు. ఇక 'ఛలో' బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్ లో తన హవా చూపిస్తోంది. ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరూ' 'భీష్మ' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం 'పుష్ప' 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలలో నటిస్తోంది. అలానే 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న కృతి శెట్టి.. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే వరుస అవకాశాలు అందుకుంటోంది. నాని హీరోగా నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రియాంక అరుళ్ మోహ‌న్.. 'శ్రీకారం' సినిమా చేస్తోంది. అలానే నాగచైతన్య 'థ్యాంక్యూ' సినిమాలో ప్రియాంక మోహ‌న్ నటించనుందని వార్తలు వస్తున్నాయి.

'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ కూడా వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. 'ఎస్ ఆర్ కల్యాణమండపం' 'గమనం' అనే రెండు చిత్రాల్లో జ‌వాల్క‌ర్ నటిస్తోంది. 'చిత్రలహరి' 'బ్రోచేవారెవరురా' 'అల వైకుంఠపురంతో' సినిమాలతో అలరించిన నివేతా పేతురాజ్.. 'విరాటపర్వం'తో పాటు చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. 'కౌసల్య కృష్ణమూర్తి' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఐశ్వ‌ర్య రాజేష్.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలోనూ కనిపించింది. ఈ క్రమంలో నేచురల్ బ్యూటీకి నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్' సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ చేతిలో పెట్టుకున్న ఈ నెక్స్ట్ జెన‌రేష‌న్ హీరోయిన్లలో నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ ఎవ‌రికి సొంతం అవుతుందో చూడాలి.




Tags:    
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

అనీష్ కోసం నాగ్, తారక్, చరణ్.. కారణమిదే..

2026-11-12 04:15 GMT

మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?

2026-11-12 04:15 GMT

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!

2026-11-12 03:36 GMT

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

2026-11-12 03:31 GMT

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

Copyright @2026

Powered by Blink CMS