• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కోలీవుడ్ ఫేస్ ఆఫ్...

'కోలీవుడ్ ఫేస్ ఆఫ్ ఇండియా' ఎవరు...?

By - Tupaki Desk
Update: 2020-05-01 11:10 GMT
సినీ ఇండస్ట్రీ లో హీరోల అభిమానుల మధ్య జరిగే ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికి వారు తమకు నచ్చని హీరోలపై ద్వేషంతో రగిలిపోతూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేసుకోడం వాళ్ళకి మామూలైపోయింది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ ఎక్కడా చూడనంతగా ఉంటాయి. వారిలో టాప్ హీరోలైన విజయ్ మరియు అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతూ ఉంటుంది. వీరి మధ్య ఫ్యాన్ వార్ అప్పుడప్పుడూ హద్దులు దాటి అనేక విమర్శలకు గురి అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య అసహ్యం కలిగించే రీతిలో ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయంటే అందులో మేజర్ క్రెడిట్ తమిళ సూపర్ స్టార్లు విజయ్ - అజిత్‌ ల అభిమానుల పుణ్యమే అని చెప్పాలి. యూట్యూబ్‌ లో వ్యూస్ లైక్స్.. ట్విట్టర్ లో ట్రెండింగులు ఇలాంటి వాటి విషయంలో రికార్డుల పిచ్చికి తెర తీసింది కూడా వీళ్లే. ఆ తర్వాత రోజుల్లో ఆ పిచ్చి మనవాళ్లకు కూడా అంటించారు. సోషల్ మీడియాలో సమయం సందర్భం లేకుండా హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం.. టార్గెట్లు పెట్టి ట్వీట్లు వేయడం.. అవతలి హీరో మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి దారుణమైన రీతిలో ట్రోలింగ్ చేయడం.. వాటిని ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యేలా చేయడం.. ఇలాంటి పనికిమాలిన పనులను మిగతా ఇండస్ట్రీల అభిమానులకు అలవాటు చేసింది ఈ ఇద్దరి హీరోల అరవ ఫ్యాన్సే.

కాగా నేడు హీరో అజిత్ పుట్టిన రోజు కావడం తో అజిత్ ఫ్యాన్స్ #HBDDearestThaIaAJITH అనే యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తుండగా మరో వైపు విజయ్ ఫ్యాన్స్ #VijayTheFaceOfKollywood అనే యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ వేస్తూ అజిత్ ఫ్యాన్స్ కి పోటీ ఇస్తున్నారు. గత ఏడాది విజయ్ పుట్టినరోజు నాడు అజిత్ ఫ్యాన్స్ కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ అందుకున్నారు. #HBDDearestThaIaAJITH ని తక్కువ చేస్తూ ఇప్పుడు #VijayTheFaceOfKollywood నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. ఒక హీరో పుట్టినరోజు వస్తే మరో హీరో ఫ్యాన్స్ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టడం.. లేదా అవతలి హీరో వాల్యూ తగ్గించేలా ప్లాన్ చేయడం ఇలాంటివి విజయ్ - అజిత్ ఫ్యాన్స్ మధ్య సర్వ సాధారణం. వీరు ఇలా చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. ఎవెరీ వీక్ ఒక పనికి మాలిన నెగిటివ్ ట్రెండ్ సృష్టిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పనికి మాలిన పనులు చూసి మన హీరోల ఫ్యాన్స్ బాగానే ఇన్‌స్పైర్ అవుతున్నారని ఇటీవలి సంఘటనలు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతుంటే విజయ్ - అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నేషనల్ వైడ్ వారి అభిమాన హీరోల క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల మధ్య ఫ్యాన్ వార్ అనేక విపరీతాలకు దారితీస్తున్న తరుణంలో చాలామంది విమర్శిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ నెగిటివ్ ట్రెండ్స్ ఏంటని ఇతర హీరోల అభిమానులు నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ఈ అరవ హీరోల అభిమానులు మాత్రం ఈ ఆధిపత్య పోరు.. నెగిటివిటీ ట్రెండ్స్ నుండి బయటపడేలా కనిపించడం లేదు.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • VijayTheFaceOfKollywood 
  • HBDDearestThaIaAJITH 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS