చంద‌మామ‌ ప్రేమ‌లో బిజినెస్ మేన్ ఎవ‌రో!

Update: 2019-12-13 10:01 GMT
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ బిజినెస్ మేన్ తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు కొన్నాళ్లుగా జోరుగా ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటిద‌వుతుంద‌ని బ‌ల‌మైన వార్త‌లొస్తున్నాయి. కానీ ఆ ప్రేమికుడు ఎవ‌రు అన్న‌ది మాత్రం ఎక్క‌డా ఫోటో ప్రూఫ్ కూడా దొర‌క‌లేదు. దీంతో ప్రియుడి విష‌యంలో కాజ‌ల్ ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హారిస్తోందన్న‌ కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ వ‌స్త్ర దుకాణ స‌ముదాయం ఓపెనింగ్ కు వెళ్లిన ఈ అమ్మ‌డు త‌న‌పై వ‌చ్చే క‌థ‌నాల‌పై స్పందించింది.  నా పెళ్లి గురించి వ‌స్తున్న వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు.  ప్రేమ‌ పెళ్లి గురించి అతి త్వ‌రలోనే నేనే క్లారిటీ ఇస్తాను అని కాజ‌ల్ అనడం విశేషం.

తాను చెప్పే వ‌ర‌కూ మీడియా  అత్యుత్సాహం చూపించాల్సిన ప‌నేలేదు అంటూ చుర‌క‌లు వేసింది. ఆమె మాట‌ల‌ను బట్టి కాజ‌ల్ ప్రేమ‌లో ఉన్న‌ట్లేన‌ని అంగీక‌రించిన‌ట్టేన‌న్న చ‌ర్చా సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ కాజ‌ల్ ను ప్రేమ గురించి ప్ర‌శ్నించిన‌ప్పుడ‌ల్లా అలాంటిందేమీ లేద‌ని క్లియ‌ర్ క‌ట్ గా చేప్పేసేది. కానీ షాపింగ్ మాల్ వ‌ద్ద అభిమానుల స‌మ‌క్షంలో వ‌ర్ష‌న్ మారింది. పెళ్లి విష‌య‌మై చాలా పాజిటివ్ గా క‌నిపించింది. ఆ శుభ‌ఘ‌డియ ఎపుడో త‌నే చెబుతుందేమో చూడాలి.

ప్ర‌స్తుతం కాజ‌ల్ కెరీర్ ప‌రిశీలిస్తే.. క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న ఇండియ‌న్-2 చిత్రంలో.. `మోస‌గాళ్లు` అనే తెలుగు- ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంలో .. `ముంబై సాగ` అనే బాలీవుడ్ చిత్రంలోనూ కాజ‌ల్ న‌టిస్తోంది. అలాగే టాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్టులు చ‌ర్చ‌ల‌ ద‌శ‌లో ఉన్నాయ‌ని చంద‌మామ‌ చెప్పుకొచ్చింది. కొన్ని స్క్రిప్ట్ లు సెల‌క్ట్ చేసి పెట్టాన‌ని ముందుగా వాటికి సంత‌కం చేసిన త‌ర్వాత మిగ‌తా వాటిపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపింది.
Tags:    

Similar News