RRR ముందు ఉన్న ఏకైక ఆప్ష‌న్ ఇదే

Update: 2022-01-26 01:30 GMT
మార్చి 18 లేదా ఏప్రిల్ 28 విడుదల అంటూ రెండు తేదీలు ప్ర‌క‌టించి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఎస్.ఎస్.రాజ‌మౌళి. ఆ రెండు తేదీల్లో ఎప్పుడు రిలీజ‌వుతుంది? అన్న డైల‌మా అభిమానుల్లో ఉంది. అయితే ఆ డైల‌మా ఇప్పుడు క్లియ‌రైన‌ట్టే.

రాజమౌళికి మార్చి 18 ఆప్షన్ లేకుండా పోయిందని గుస‌గుస వినిపిస్తోంది. దానికి కార‌ణం లేక‌పోలేదు. దివంగత పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం `జేమ్స్` మార్చి 17 (పునీత్ పుట్టిన‌రోజు)న విడుదలవుతుందని ప్రకటించారు. మార్చి 17 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలో ఏ ఇత‌ర‌ సినిమా విడుదల చేయకూడదని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తద్వారా రాష్ట్ర అభిమాన తార‌ కుమారునికి నివాళిగా అన్ని థియేటర్లలో జేమ్స్ మాత్రమే ప్లే చేస్తారు.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే RRR ఒక తేదీని వ‌దులుకున్న‌ట్టే. మార్చి 18 ఎంపిక ఛాయిస్ ఇప్పుడు లేన‌ట్టేన‌ని భావిస్తున్నారు. RRR రేంజ్ చిత్రానికి కర్ణాటక చాలా పెద్ద మార్కెట్. దాదాపు 100 కోట్లు సునాయాసంగా వ‌సూలు చేసే వీలుంటుంది. అందువ‌ల్ల క‌ర్నాట‌క మార్కెట్ ని జాగ్ర‌త్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. దాంతో సినిమాకి ఏప్రిల్ 28వ తేదీనే ఆప్షన్ గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. కాబ‌ట్టి దీనిపై క‌ర్నాట‌క పంపిణీదారుల‌ను ఆరాలు తీసే అవ‌కాశం ఉంది. జ‌క్క‌న్న బృందం ప్ర‌స్తుతం ఏం ఆలోచిస్తోంది?  ఒక తేదీని ఫిక్స్ అవుతుందా లేదా? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News