బ్యాచిలర్ సూపర్ స్టార్ కి 60 ఏళ్లు..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిలిచి.. 60వ ఏడాదిలోకి అడుగుపెట్టారు కండల వీరుడు, బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్.;
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిలిచి.. 60వ ఏడాదిలోకి అడుగుపెట్టారు కండల వీరుడు, బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్. డిసెంబర్ 27న ఆయన పుట్టిన రోజు కావడంతో డిసెంబర్ 26 రాత్రి నుండే ముంబై సమీపంలోని పన్వేల్ ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పుట్టినరోజు సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు టాలీవుడ్ , బాలీవుడ్ తో పాటు క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు..
ముఖ్యంగా సల్మాన్ ఖాన్ బర్తడే పార్టీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆయన సతీమణి సాక్షి ధోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రకుల్ ప్రీత్ సింగ్ , ప్రగ్యా జైస్వాల్, రణదీప్, మనీష్ పాల్ వంటి సెలబ్రిటీలతోపాటు సల్మాన్ ఖాన్ సోదరులు, మేనల్లుళ్లు అలాగే సోదరీమణులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే ఆయనతో కలిసి పని చేసిన దర్శకులు, నటీనటులు కూడా ఈ బర్తడే పార్టీలో సందడి చేశారు.
ఇదిలా ఉండగా మరోవైపు సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బ్యాటిల్ ఆఫ్ ఘల్వాన్. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ ని కూడా విడుదల చేశారు..ఇకపోతే సల్మాన్ ఖాన్ 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సల్మాన్ ఖాన్.. ఒకప్పుడే కాదు ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు సొంతం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారిపోయారు. ముఖ్యంగా మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈయన.. ఈ ప్రయాణంలో తన అద్భుతమైన నటనతోనే కాదు నిర్మాతగా కూడా రెండు నేషనల్ అవార్డులు, నటుడిగా రెండు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అత్యంత ప్రజాదారణ పొందిన హీరోలలో ఒకరిగా పేరు దక్కించుకున్న ఈయన.. 2015, 2018 సంవత్సర కాలంలో ప్రపంచంలో అత్యధిక పారితోషకం పొందిన నటుడిగా ఫోర్బ్స్ జాబితాలో చేరిపోయారు.
1988లో 'బీవీ హో తో ఐసీ ' అనే చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈయన.. ఆ తర్వాత 'మైనే ప్యార్ కియా' సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా బెస్ట్ మేల్ డెబ్యూ విభాగంలో ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నారు. అలాగే 1991 నుండి ఇప్పటివరకు వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సల్మాన్ ఖాన్.
ఇదిలా ఉండగా మరొకవైపు సల్మాన్ ఖాన్ కి, ఈద్ పండుగకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ పండుగ వచ్చిందంటే చాలు కచ్చితంగా ఈయన తన సినిమాను విడుదల చేయాల్సిందే. అలా వాంటెడ్, బజరంగీ భాయ్ జాన్ , దబాంగ్, సుల్తాన్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ వంటి చిత్రాలు ఇలా ఈద్ పండుగ సందర్భంగా విడుదలైనవే అయితే ఇప్పుడు అపూర్వ లఖియా దర్శకత్వంలో వస్తున్న బ్యాటిల్ అఫ్ గల్వాన్ లో కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈద్ పండుగకు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
ఇకపోతే సల్మాన్ ఖాన్ ఎన్ని వేల కోట్లకు ఆస్తిపరుడైన అంతే సింపుల్ గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆస్తిపరంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు మాత్రం ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. అలా ఈయన ఏవి మాల్ఫోర్మేషన్, బ్రెయిన్ ఎన్యోరిజమ్ , ట్రైజేమినల్ న్యూరల్జియా వంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నానని ఇటీవలే చెప్పుకొచ్చారు.
ఇకపోతే 60 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఒక దశ దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే.. విడాకులు, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎన్నో కఠినమైన విషయాలు ఉంటాయి. వాటిని కొనసాగించడం సులభం కాదు. అందుకే పెళ్లి చేసుకోలేదు అని చెప్పారు. అయితే పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలని.. తనకంటూ ఒక వారసులు పుడితే వారిని తన కుటుంబమే చూసుకుంటుంది అంటూ తెలిపారు. ఇకపోతే ప్రేమ విషయంలో కూడా పలుమార్లు విఫలం కూడా చెందారు సల్మాన్ ఖాన్. ఇలా ఒక్కటేమిటి సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ప్రతి విషయం కూడా ఆసక్తిగానే ఉంటుందని చెప్పవచ్చు.