విరోష్ రిసెప్షన్: సంప్రదాయానికి వన్నె తెచ్చిన కొత్త జంట!
ఇక వరుడు విజయ్ దేవరకొండ తనదైన స్టైల్‌లో తెలంగాణ - దక్షిణ భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తెల్లని పెరల్ వైట్ హాఫ్ షోల్డర్ షర్ట్ - పంచె ధరించి కనిపించారు.;
హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా వేదికగా అత్యంత వైభవంగా జరిగిన #VIROSH (విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న) రిసెప్షన్ వేడుకలో ఈ జంట తమ వేషధారణతో సరికొత్త సంప్రదాయ ట్రెండ్‌ను సెట్ చేసింది. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీ పెళ్లిళ్లంటే పశ్చాత్త దేశపు `పాస్టల్` రంగులు.. ఆధునిక డిజైన్ల వెంటే అందరూ వెళ్తుంటే..ఈ కొత్త జంట మాత్రం తమ మూలాలకు ప్రాధాన్యతనిస్తూ అచ్చమైన భారతీయ సంప్రదాయ దుస్తులలో మెరిసిపోయారు. ఈ రిసెప్షన్ లైవ్ అప్‌డేట్స్ చూస్తున్న అభిమానులు వారి వేషధారణలోని వైశిష్ట్యాన్ని చూసి ముగ్ధులవుతున్నారు.
కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న ఈ వేడుక కోసం ఎరుపు రంగు మైసూర్ సిల్క్ చీరను ఎంచుకుని దక్షిణ భారత నారీమణిగా అద్భుతంగా కనిపించింది. రష్మిక కట్టిన చీరపై ఉన్న బంగారు వర్ణపు జరీ బోర్డర్ ఆమె రాయల్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. ముఖ్యంగా తన స్వస్థలమైన కర్ణాటక సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆమె ఈ మైసూర్ సిల్క్ చీరను ఎంపిక చేయడం విశేషం. దీనికి తోడుగా నిండుగా ధరించిన టెంపుల్ జ్యువెలరీ, నుదుటిన చిన్న బిందీ.. సంప్రదాయ బ్రైడల్ మేకప్ కొత్త పెళ్లికూతురికి ఒక నిండుదనాన్ని ఇచ్చాయి.
ఇక వరుడు విజయ్ దేవరకొండ తనదైన స్టైల్‌లో తెలంగాణ - దక్షిణ భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తెల్లని పెరల్ వైట్ హాఫ్ షోల్డర్ షర్ట్ - పంచె ధరించి కనిపించారు. విజయ్ తన లుక్‌ను చాలా సింపుల్‌గా ఉంచినా ఆ వేషధారణలో ఒక రాజసం ఉట్టిపడింది. గతంలో తన సినిమాల్లో ట్రెండీ లుక్స్‌తో అలరించిన విజయ్.. జీవితంలోని అతిపెద్ద వేడుకలో ఇలా అచ్చమైన తెలుగు కుర్రాడిలా కనిపించడం అభిమానులను విశేషంగా ఆకర్షించింది.
ఈ జంట తమ దుస్తుల ద్వారా రెండు భిన్న సంస్కృతుల కలయికను చాటిచెప్పారు. విజయ్ ధరించిన ఐవరీ వెస్టి (పంచె) తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిస్తే, రష్మిక ధరించిన సిల్క్ చీర కర్ణాటక సంస్కృతిని ఆవిష్కరించింది. కేవలం డిజైనర్ దుస్తులే కాకుండా.. ఆ దుస్తుల వెనుక ఉన్న సాంస్కృతిక అర్థం ఈ వేడుకను మరింత అర్థవంతంగా మార్చింది. రిసెప్షన్ వేదిక వద్ద ఈ అందమైన జంట నడుచుకుంటూ వస్తుంటే `దేవతా జంట` భూమిపైకి దిగివచ్చిందా అన్నట్లుగా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వేషధారణతో పాటు వీరి అలంకరణలో డీటెయిలింగ్ కూడా నెటిజనుల దృష్టిని ఆకర్షించాయి. రష్మిక ధరించిన బంగారు గాజులు, లేయర్డ్ నెక్లెస్‌లు, విజయ్ ధరించిన సింపుల్ గోల్డ్ చైన్ వారిద్దరి అవుట్‌ఫిట్స్‌ను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశాయి. మోడ్రన్ వేడుకల్లో కూడా మన కట్టుబొట్టును కాపాడుకోవచ్చని.. అది ఎంత అందంగా ఉంటుందో ఈ `విరోష్` జంట నిరూపించింది.
మొత్తానికి.. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లి రిసెప్షన్ వేషధారణ కేవలం ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రమే కాదు.. ఇది వారి సంప్రదాయాల పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు , వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్‌లో ఈ జంటను చూసిన అభిమానులు `మేడ్ ఫర్ ఈచ్ అదర్` అంటూ నీరాజనాలు పలుకుతున్నారు.