సంగీత సంచలనం బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్!
కోలీవుడ్ యువ సంచలనం అనిరుద్ రవిచందర్ ఎలాంటి హిట్ ఆల్బమ్స్ అందించాడో చెప్పాల్సిన పనిలేదు.;
కోలీవుడ్ యువ సంచలనం అనిరుద్ రవిచందర్ ఎలాంటి హిట్ ఆల్బమ్స్ అందించాడో చెప్పాల్సిన పనిలేదు. బీజీఎమ్ తోనే సినిమా హిట్ చేయగల సమర్ధుడు. తెలుగులోనూ అలాంటి సంగీతం అందించిన సినిమాలున్నాయి. అయితే సంగీత పరంగా తానెక్కడా ఫెయిలవ్వలేదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేదు. తొలిసారి టాలీవుడ్ లోకి `అజ్ఞాతవాసి` సినిమాతో ఎంటర్ అయ్యాడు. కానీ ఆ సినిమా మ్యూజికల్ గా ఎంత మాత్రం కనెక్ట్ అవ్వలేదు. సినిమా ఫలితం చూస్తే డిజాస్టర్ గా మిగిలిపోయింది.
అటుపై నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమాకు సంగీతం అందించాడు. `జెర్సీ` హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. రియల్ ఇన్సిండెంట్స్ స్పూర్తితో తెరకెక్కించిన ఆ సినిమా చరిత్రలో నిలిచిపో యే వసూళ్లు సాధించాలి. కానీ ఆ రేంజ్ కు జెర్సీ రీచ్ అవ్వలేదు. అటుపై నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' కు సంగీతం అందించాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. అనంతరం కొంత గ్యాప్ తీసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' పార్ట్ వన్ కి సంగీతం అందించాడు. మ్యూజికల్ గా ఈసినిమా సచంలనమైంది.
బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. కానీ తారక్ రేంజ్ హిట్ గా పాన్ ఇండియాలో సంచలనం కాలేదు. సినిమాపై కొన్ని విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అనంతరం విజయ్ దేరకొండ నటించిన `కింగ్ డమ్` కి సంగీతం అందించాడు. ఈ సినిమా ఫలితం కూడా నిరాశ పరిచింది. అలా అనిరుద్ తెలుగు సినిమాల ఓల్డ్ లైనప్ చూస్తే? అతడి వైఫల్యం కంటే? కంటెంట్ వైఫల్యం హైలైట్ అవుతుంది. అప్పటి నుంచి సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. నాని తో మూడవ సారి పని చేస్తున్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్నది 'ది ప్యారడైజ్' కు సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈసినిమాతో భారీ హిట్ అందుకుని సత్తా చాటాలని ఎదురు చూస్తున్నాడు. భారీ హిట్లు లేకపోయినా అనిరుద్ కి అవకాశాలు మాత్రం టాలీవుడ్ లో ఎక్కడా తగ్గలేదు. డిమాండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నాడు. `దేవర2` , `మ్యాజిక్`, 'బన్నీ 23'వ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఇవిగాక కోలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తున్నాడు. 'జన నాయగన్', 'లవ్ ఇన్సురెన్స్ కంపెనీ', 'డీసీ', 'జైలర్ 2','అర్సన్', 'కింగ్', 'తలైవార్ 173' తో పాటు మరో సినిమా క్యూలో ఉన్నాయి.