అల్లు ఫ్యామిలీ ట్రీ సవివరంగా..
ఇటీవల అల్లు స్టూడియోస్‌లో తీసిన కుటుంబ ఫోటోను విశ్లేషిస్తే.. అందులో అల్లు అరవింద్ - నిర్మల దంపతులు తమ కుమారుల పక్కన నిలబడి ఆశీర్వధిస్తున్న తీరు ముచ్చటగా ఉంది.;
మార్చి 6న జరగనున్న అల్లు శిరీష్ - నైనికల వివాహ వేడుకలు అల్లు కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మెగా - అల్లు కుటుంబాల కలయికతో ఈ వేడుక ఒక `రాయల్ వెడ్డింగ్`ను తలపిస్తోంది. ప్రీవెడ్డింగ్ రిసెప్షన్ లో అల్లు అరవింద్ సారథ్యంలో అల్లు ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన తీరు.. వారి `కుటుంబ వృక్షం` గురించిన వివరాల్లోకి వెళితే...
అల్లు ఫ్యామిలీ వృక్షం.. మూడు తరాల ప్రయాణం ఎంతో ఇంట్రెస్టింగ్. అల్లు కుటుంబం టాలీవుడ్‌లో దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ వృక్షానికి మూలపురుషుడు లెజెండరీ నటుడు పద్మశ్రీ `అల్లు రామలింగయ్య`. మొదటి తరానికి చెందిన రామలింగయ్య - కనకరత్నం దంపతులు వేసిన బలమైన పునాది మీదనే నేడు ఈ సినీ సామ్రాజ్యం నిలబడింది. రెండవ తరంలో వీరికి ఐదుగురు సంతానం. వారిలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఒకరైతే.. మిగిలిన నలుగురు కుమార్తెలు సురేఖ (మెగాస్టార్ చిరంజీవి భార్య), వసంత, భారతి, నవభారతి. ఈ క్రమంలోనే అల్లు-మెగా కుటుంబాల మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది.
అల్లు అరవింద్ - నిర్మల దంపతుల మూడవ తరం వారసులుగా ముగ్గురు కుమారులు టాలీవుడ్‌లో తమదైన ముద్ర వేశారు. పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ) నిర్మాతగా కొనసాగుతుండగా, రెండవ కుమారుడు అల్లు అర్జున్ `ఐకాన్ స్టార్`గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఇక మూడవ కుమారుడు అల్లు శిరీష్ హీరోగా రాణిస్తూ.. ఇప్పుడు నైనికతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ముగ్గురు సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేయడం వేడుకలో హైలైట్‌గా నిలిచింది.
ఇటీవల అల్లు స్టూడియోస్‌లో తీసిన కుటుంబ ఫోటోను విశ్లేషిస్తే.. అందులో అల్లు అరవింద్ - నిర్మల దంపతులు తమ కుమారుల పక్కన నిలబడి ఆశీర్వధిస్తున్న తీరు ముచ్చటగా ఉంది. అల్లు శిరీష్ తన కాబోయే భార్య నైనికతో కలిసి ఎంబ్రాయిడరీ షేర్వానీలో మెరిసిపోతుండగా.. నైనిక హెవీ వర్క్ లెహంగాలో దేవతలా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్ , అర్హలతో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా అల్లు అర్హ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోకే నిండుదనాన్ని తెచ్చింది.
ఈ వేడుకలో అల్లు-మెగా బంధం మరోసారి బలంగా ఆవిష్కృతమైంది. అల్లు అరవింద్ సోదరి సురేఖ ఈ పెళ్లి పనులను దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం. కేవలం అల్లు కుటుంబమే కాకుండా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకుంటూ అల్లు శిరీష్‌కు తమ మద్దతును తెలిపారు. ఈ పెళ్లి నుంచి అల్లు కుటుంబ ఫోటోలు ఇప్పుడు వెబ్ లో వైరల్ గా మారాయి. వీటిలో సంప్రదాయం -ఆధునికత కలగలిసిన ఈ ఫోటోలో అల్లు ఫ్యామిలీ అంతా అచ్చమైన భారతీయ కట్టుబొట్టుతో తమ కుటుంబ విలువలను చాటిచెప్పారు.
దశాబ్దాల క్రితం లెజెండ్ అల్లు రామలింగయ్య నాటిన చిన్న మొక్క.. నేడు అల్లు అరవింద్ సమర్థవంతమైన పర్యవేక్షణలో ఒక మహావృక్షమై టాలీవుడ్‌ను ఏలుతోంది. శిరీష్-నైనికల వివాహంతో ఈ కుటుంబ వృక్షంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఒకే ఫ్రేమ్‌లో మూడు తరాల అల్లు వారసులను చూడటం మెగా- అల్లు అభిమానులకు కనువిందుగా మారింది.