గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న దర్శకులు గాడిలో!
ప్లాప్ ల్లో ఉన్నప్పుడు ఒక్క సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని హీరో, డైరెక్టర్లు ఎంతో ఆశీస్తారు. కొన్నిసార్లు సక్సెస్ తో ఫాంలో కి వస్తారు.;
ప్లాప్ ల్లో ఉన్నప్పుడు ఒక్క సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని హీరో, డైరెక్టర్లు ఎంతో ఆశీస్తారు. కొన్నిసార్లు సక్సెస్ తో ఫాంలో కి వస్తారు. మరికొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా వైఫల్యమే ఎదురవుతుంది. కానీ కొన్నిసార్లు గోల్డెన్ ఛాన్సెస్ వచ్చినా? వైఫల్యంతో వెనుకబడుతుంటారు. మారుతి, బోయపాటి శ్రీను, కిషోర్ తిరుమల, అనుదీప్ కెవి అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే `స్కంద` వైఫల్యంతో సంబంధం లేకుండా నటసింహ బాలకృష్ణ బోయపాటి శ్రీను కు అవకాశం కల్పించారు. ఆ ఇద్దరి కాంబినేషన్ లో `అఖండ`కు సీక్వెల్ గా `అఖండ 2` తెరకెక్కడం పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడం తెలిసిందే.
పాన్ ఇండియాలో సక్సెస్ అవ్వడానికి బోయపాటికిది గొప్ప అవకాశం . కానీ బోయపాటి కంటెంట్ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈసినిమా సక్సెస్ అయితే గనుక బోయపాటి తో పాన్ ఇండియా సినిమాలు తీయడానికి చాలా మంది హీరోలు క్యూలో ఉండేవారు. ప్రముఖంగా సీనియర్ స్టార్లు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్స్ కు బోయపాటి పర్పెక్ట్ గా సెట్ అవుతారు. టైర్ 2 హీరోలు కూడా బోయపాటి కోసం ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బోయపాటి మళ్లీ హిట్ కొడితే తప్ప వాళ్లు లైన్ లోకి రారు.
మారుతికి ప్రభాస్ రూపంలో బంగారం లాంటి అవకాశమే `ది రాజాసాబ్` రూపంలో వచ్చింది. రీజనల్ మార్కెట్ కే పరిమితమైన మారుతిని పాన్ ఇండియాకు తీసుకెళ్లాలని ప్రభాస్ ఛాన్స్ ఇస్తే ఓ ప్లాప్ సినిమా తీసి విమర్శలు ఎదు ర్కున్నాడు. అదే హిట్ అయితే మారుతి కోసం మహేష్, రామ్ చరణ్, బన్నీ లాంటి స్టార్లే క్యూలో ఉండేవారు. అలాగే `జాతిరత్నాలు` తర్వాత అనుదీప్ కె.వి చప్పబడిపోయాడు. ఆ తర్వాత తీసిన సినిమా లేవి కలిసి రాలేదు. ఇటీవలే విశ్వక్ సేన్ తో `ఫంకీ` అనే సినిమా తీసాడు. అనుదీప్ అభిరుచికి తగ్గ హీరో విశ్వక్ సేన్.
అలాంటి నటుడితో హిట్ అందుకుంటే? అనుదీప్ బిజీ అయ్యేవాడు. కిషోర్ తిరుమల కూడా గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. మాస్ రాజా రవితేజ హీరోగా కిషోర్ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అంటూ ఓ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కిషోర్ ప్లాప్ ల్లో ఉన్న సమయంలో రవితేజ ఛాన్స్ ఇస్తే ఓ యారవేజ్ సినిమా తీసాడు. బ్లాక్ బస్టర్ అయితే గనుక మంచి అవకాశాలు దక్కేవి. మరి ఈ నయా దర్శకులంతా మళ్లీ ఏ హీరోతో సినిమా చేస్తారు? ఎప్పుడు విజయంతో ముందుకొస్తారో చూడాలి. కానీ ఫాంలో ఉన్న హీరోలంతా బిజీగా ఉండటంతో? వాళ్లతో ఛాన్స్ కష్టం. టైర్ 3 హీరోల్లో కొందరు సరైన కథల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లతో ఛాన్స్ తీసుకుంటే సమయం వృద్దా కాకుండా ఉంటుంది.