శివాజీని బట్టల సత్తీగా మార్చిన ప్రొడ్యూసర్!
ఈ సందర్భంగా శివాజీపై నిర్మాత ఏస్‌కెఎన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నా స్నేహితులకు, ఫాలోవర్స్‌కు పతంగ్ ఫ్రీ షో వేస్తా.;
`దండోరా` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. అనసూయ, చిన్మయి..ఇటీవల శివాజీ వ్యాఖ్యలపై ఫైర్ కావడంతో వివాదం మరింతగా ముదుతుతోంది. ఇదే వరుసలో రామ్‌గోపాల్ వర్మ శివాజీపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక మెగా బ్రదర్ కూడా ఈ జాబితాలో చేరి శివాజీని ఉతికి ఆరేసినంత పని చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో కొట్టండి అంటూ ఫైర్ అయ్యారు.
దీంతో శివాజీ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ `పతంగ్`. ప్రణీత్ పత్తిపాటి దర్శకుడు. గౌతమ్ మీనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా శివాజీపై నిర్మాత ఏస్‌కెఎన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నా స్నేహితులకు, ఫాలోవర్స్‌కు పతంగ్ ఫ్రీ షో వేస్తా. ఈ రెండు, మూడు రోజుల్లో ఒక మల్టీప్లెక్స్ స్క్రీన్ మొత్తం తీసుకుని అందరిని ఆహ్వానిస్తా.. ప్రెస్‌మీట్‌లో ఏదైనా మాట్లాడితే అది వైరల్ అవుతుందన్న విషయం కూడా `పతంగ్` టీమ్‌కు తెలియదు. సినిమా బాగుంటే జనాలు వస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అంటూ శివాజీ ఉదంతాన్ని ఇండైరెక్ట్‌గా ఎత్తిచూపడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అంతే కాకుండా రివ్యూలపై కూడా సెటైర్లు వేశాడు. ఒకడు సినిమా చూడకుండానే రివ్యూ రాసేస్తాడు. ఇంకొకడు ఏదో మాట్లాడేసి అటెన్షన్ తిప్పుకుంటాడు. అమ్మాయిలు, హీరోయిన్స్ మీకు సౌకర్య వంతంగా ఉండే దుస్తులు వేసుకోండి. మీపై మీకు నమ్మకాన్ని ఇచ్చే దుస్తులు వేసుకోండి. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినకండి` అంటూ శివాజీని పరోక్షంగా బట్టల సత్తిగా మార్చేశాడు ఎస్‌కెఎన్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన శివాజీ మరి ఎస్‌కెఎన్ బట్టల సత్తి డైలాగ్‌పై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అనే కామెంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి. శివాజీ వ్యాఖ్యలపై సీరియస్ అయిన తెలంగాణ మహిళా కమీషన్ శనివారం తనని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం, శివాజీ వెంటనే మహిళా కమీషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవడం తెలిసిందే. మరోసారి కూడా తనని పిలిస్తే వస్తానని, ఏమి అడిగనా సమాధానాలు చెబుతానని శివాజీ వెల్లడించారు.