బాటిల్ ఆఫ్ గల్వాన్ టీజర్ అదిరింది!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాపుల తరువాత నటిస్తున్న ఇంటెన్స్ వార్ డ్రామా `బాటిల్ ఆఫ్ గల్వాన్`.;
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాపుల తరువాత నటిస్తున్న ఇంటెన్స్ వార్ డ్రామా `బాటిల్ ఆఫ్ గల్వాన్`. అపూర్వలఖియా దర్శకుడు. `జంజీర్` వంటి భారీ డిజాస్టర్ తరువాత అపూర్వలాఖియా చేస్తున్న సినిమా ఇది. సల్మాన్‌ఖాన్ ఫిలింస్ సమర్పణలో సల్మాన్ ఖాన్ నటిస్తూ ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హిమేష్ రేష్మియా చాలా కాలం తరువాత చేస్తున్న భారీ మూవీ ఇది. కమాండింగ్ ఆఫీసర్ బి. సంతోష్‌బాబు పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు.
జూన్ 15, 2020న గల్వాన్ లోయ ప్రాంతంలో భారత సైనికులకు, చైనా సైనికులకు మధ్య జరిగిన యదార్ధ ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో 200 మంది భారతీయ సైనికులకు సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. 200 మంది భారతీయ సైనికులకు చైనాకు చెందిన 1200 మంది చైనా లిబరేషన్ ఆర్మీకి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కేవలం 200 మందిలో కలిసి వీరోచితంగా పోరాడి కమాండింగ్ ఆఫీసర్ బి. సంతోష్‌బాబు వీరమణం పొందారు.
ఆ నాటి సంఘటన నేపథ్యంలోనే ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1200 మంది చైనా లిబరేషన్ ఆర్మీ మన దేశ భూభాగంలోకి చొరబడకుండా కేవలం 200 మంది సైనికులతో సంతోష్ బాబు ఎలాంటి యుద్ధం చేశాడో ఇందులో కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్ 27 శుక్రవారం సల్మాన్‌ఖాన్ పుట్టిన రోజుని పురస్కరించుకుని మేకర్స్ ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరమైన విజువల్స్‌తో, సల్మాన్ ఖాన్ వాయిస్‌తో సాగింది.
సల్మాన్ వాయిస్.. గల్వాన్ లోయలోని అందమైన విజువల్స్ తో టీజర్ మొదలైంది. `జవానో యాద్ రహే ఝఖమ్ లగేతో మెడల్ సమజ్‌నా...ఔర్ మౌత్ దికేతో సలామ్ కర్‌నా..ఔర్ కెహనా.. బిర్సా ముండాకీ..జై..బజ్‌రంగ్ బలీకీ జై..భారత్ మాతాకీ జై.. అంటూ భారత్ భూభాగంలోకి చొచ్చుకొస్తున్న 1200 మంది చైనా లిబరేషన్ ఆర్మీకి కర్ర పట్టుకుని ఎదురెళుతున్న సల్మాన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. సైనికుడిగా సల్మాన్ ఖాన్ మేకోవర్, గల్వాన్ లోయతో పాటు హిమాలయ విజువల్స్, సల్మాన్ ఇంటెన్స్ లుక్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అత్యంత భారీ స్థాయిలో సల్మాన్ ఖాన్ నటిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 17న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సల్మాన్ దీనిపైనే ఆశలు పెట్టుకున్నాడు. సల్మాన్ `దబాంగ్ 3` నుంచి సికిందర్ వరకు గత ఐదారేళ్లుగా వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొటున్నాడు. `బాటిల్ ఆఫ్ గల్వాన్`తో మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.