శివాజీ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఫైర్.. ఏమన్నారంటే?
ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు శివాజీ కామెంట్స్ పై స్పందించగా.. ఆ జాబితాలోకి ఇప్పుడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేరారు. శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఫుల్ ఫైర్ అయ్యారు.;
టాలీవుడ్ నటుడు శివాజీ రీసెంట్ గా దండోరా మూవీ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్.. తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు శివాజీ కామెంట్స్ పై స్పందించగా.. ఆ జాబితాలోకి ఇప్పుడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేరారు. శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఫుల్ ఫైర్ అయ్యారు.
ఓ కార్యక్రమంలో స్పందించిన ప్రకాష్ రాజ్, శివాజీ కామెంట్స్ ను ఎవరూ సమర్థించరని అన్నారు. చాలా చెత్తగా మాట్లాడారని విమర్శించారు. ఆడవాళ్లు అంటే ఏమనుకుంటున్నారని, ఆ భాష ఏంటని ప్రశ్నించారు. లోపల అనుకున్నదే బయటకు అన్నారని, అలా మాటలు ఆడడం ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఆ అహంకారం ఏంటని అడిగారు.
ఆడవాళ్లకు మగవాళ్ల నుంచే తరతరాలుగా అన్యాయం జరుగుతుందని అన్నారు. ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు సంస్కారం ఉండాలన్న విషయాన్ని గుర్తు చేశారు. క్షమాపణలు కూడా సంస్కారంగా అడగలేదని చెప్పారు. అనసూయను ఆంటీ అంటున్నారని, బాడీ పార్ట్స్ పై కామెంట్స్ చేయడం తప్ప, ఇంకేమీ రాదు వాళ్లకంటూ ఫైర్ అయ్యారు.
ఎంత సంస్కారులు అనుకొని మాట్లాడుతున్నారో.. అది అంత అసహ్యమని తెలిపారు. అనసూయను, అనసూయ లాంటి వారిని తాను సపోర్ట్ చేస్తానని, ఆడవాళ్లకు సపోర్ట్ చేయడం తన బాధ్యత, కర్తవ్యమని చెప్పారు. శివాజీ కానీ, ఎవరైనా గానీ.. ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా చెప్పే విధానం ఉందని అన్నారు.
''శివాజీ సారీ చెప్పాడు. కానీ మిగతా వాళ్లు వదలరు. అనసూయని స్ట్రాంగ్ గా ఉండాలంటూ ట్వీట్ చేశాను. ఆ సంస్కారుల అసహ్యం నాకు తెలుస్తోంది. నన్నూ అలాగే తిడుతుంటారు. తల్లిని లాగుతారు.. చెల్లిని, కూతురుని లాగుతారు. వాళ్ల బ్రెయిన్ అక్కడే ఉందో ఆ విధంగానే మాట్లాడుతారు. కచ్చితంగా శివాజీ అన్న మాటలు చాలా తప్పు'' అని తెలిపారు.
''ఒక సభ్యసమాజంలో ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వెవరు చెప్పడానికి.. అందుకే దృష్టి మార్చుకోవాలి. అమ్మాయిలను గిల్లేది మగవాళ్లే కదా.. ఆడవాళ్లు కాదు కదా.. పోకిరి సినిమాలో మాదిరిగా గిల్లితే గిల్లించుకోవాలని ఎవరైనా చెబుతారా.. అది చాలా అన్యాయం'' అని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అంతకుముందు అనసూయ ట్వీట్ కు ప్రకాష్ రాజ్ రిప్లై ఇస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఆ సంస్కారవంతులను మొరుగుతూనే ఉండనివ్వండంటూ మండిపడ్డారు. అది అలాంటి వ్యక్తుల నీచమైన మనస్తత్వమమని తెలిపారు. అందుకే ధైర్యంగా నిలబడమని సూచించారు. అండగా ఉన్నామని ప్రకాష్ రాజ్ హామీ ఇచ్చారు.