ఇండియన్ స్క్రీన్‌పై అలాంటి ఎపిసోడ్ రాలేదు: మారుతి
తాజా ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ `ది రాజా సాబ్` గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.;
రెబల్ సాబ్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `ది రాజా సాబ్` భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ భాషల్లో అత్యంత భారీగా విడుదల కానుంది. ప్రభాస్ మొదటిసారి ఒక హారర్ కామెడీలో నటించడంతో అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకాలం భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్లతో అలరించిన ప్రభాస్ లోని కామిక్ టైమింగ్ ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్సాహం కూడా అభిమానుల్లో ఉంది. అదే సమయంలో చాలా హారర్ ఫాంటసీ సినిమాలను చూసేసిన ప్రేక్షకులకు మారుతి ఈసారి ఒక కొత్త హారర్ సినిమాని చూపించబోతున్నాడా? అన్నది ఆసక్తిగా మారింది. శ్రద్ధా కపూర్- రాజ్ కుమార్ రావు నటించిన స్త్రీ 2 భారీ బ్లాక్ బస్టర్ గా మారిన క్రమంలో ప్రభాస్ హారర్ కామెడీపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. మరి కాసేపట్లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్న క్రమంలో అభిమానులు అత్యంత ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
`ది రాజా సాబ్` ఈవెంట్ గురించి అంతగా హైప్ క్రియేట్ చేయకుండానే పీపుల్స్ మీడియా సైలెంట్ గా వేడుకను నిర్వహిస్తోంది. అయితే ఈ ఈవెంట్ లో సర్ ప్రైజ్ ఏమిటన్నది వేచి చూడాల్సి ఉంది. తాజా ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ `ది రాజా సాబ్` గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ గెటప్ గురించి, కొన్ని ఎలివేషన్స్ గురించి మారుతి ప్రస్థావిస్తూ... సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఇందులో చూసిన ప్రభాస్ కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోతాడని, ప్రభాస్ గెటప్ అంతగా ఆడియెన్‌ని ఆకట్టుకుంటుందని మారుతి అన్నారు.
ఇలాంటి హారర్ కామెడీలలో నటీనటుల విషయానికి వస్తే, స్టార్లు ఎవరి రేంజులో వారు ప్రేక్షకులకు కొత్త అనుభం ఇస్తారు. ప్రభాస్ లాంటి స్టార్ స్థాయికి తగ్గ ఎపిసోడ్స్ పడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూస్తారు. ఎలాంటి ఎపిసోడ్ పడితే యూనిక్ గా ఉంటుందో అలాంటి ఎపిసోడ్ ప్రభాస్ కోసం డిజైన్ చేసాం. ఇక మూవీలో ప్రభాస్ వేషధారణ గురించి ఆడియెన్ మాట్లాడుకోవాలి అంటే దానికోసం చాలా జాగ్రత్తలే తీసుకోవాలి కదా..! అతడి గెటప్, హెయిర్, స్టైల్, స్లాంగ్ ప్రతిదీ ఎంతో కేర్ తీసుకుని డిజైన్ చేసాం. ముఖ్యంగా ప్రభాస్ స్వాగ్ యువతరం హృదయాలను గెలుచుకుంటుంది. అతడు కూచున్నా, నిలబడినా, మాట్లాడినా అతడి బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రభాస్ ఇచ్చే డీటెయిలింగ్ థియేటర్ లో మామూలుగా ఎంజాయ్ చేయరు..`` అని మారుతి వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుక ఉత్కంఠగా కొనసాగుతోంది.