స్టోరీ పోస్టర్ తోనే ఎట్రాక్ట్ చేస్తున్నారుగా!
శుభం సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ నటుడు హర్షిత్ రెడ్డి తన తదుపరి చిత్రంగా దీవానా అనే హార్ట్‌ఫుల్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.;
శుభం సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ నటుడు హర్షిత్ రెడ్డి తన తదుపరి చిత్రంగా దీవానా అనే హార్ట్‌ఫుల్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా చిత్ర బృందం టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఒక అందమైన స్టోరీ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రేమలోని తీయదనం, ఆవేశం, పిచ్చి అన్నీ కలగలిసిన భావోద్వేగాలను ఎంతో ఆహ్లాదకరంగా చూపించారు.
ఆకట్టుకుంటున్న డైలాగులు
పోస్టర్‌లో హర్షిత్ రెడ్డి కొత్త లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆయన చెప్పిన వాయిస్ ఓవర్, ప్రేమపై ఉన్న అతని ఎమోషనల్ డెప్త్ ను తెలియచేస్తుంది. ప్రేమ మనిషిని ఎంతగా మార్చగలదో, ఎంత లోతుగా ప్రభావితం చేయగలదో తెలియజేసే డైలాగులు చాలా బావున్నాయి. పోస్టర్‌లో కనిపించిన సంభాషణలు కేవలం పదాలుగా కాకుండా భావాలుగా వినిపిస్తున్నాయి. హర్షిత్ ముఖంలో కనిపిస్తున్న ఎక్స్‌ప్రెషన్లు, అతని కళ్లలో మెదిలే ఆవేదన ప్రేక్షకుల్లో కథపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
దీవానా సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేమలోని తీవ్రత, ఆత్మీయత, త్యాగం లాంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ఒక గాఢమైన ప్రేమకథను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లు స్టోరీ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. పోస్టర్ ద్వారా చిత్ర బృందం కథలోని ఎమోషనల్ లెవెల్ ను ముందుగానే పరిచయం చేసింది.
ఇక సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ అందించిన మధురమైన స్వరాలు పోస్టర్‌కు మరింత ప్రాణం పోశాయి. నేపథ్య సంగీతం లవ్ ఫీలింగ్ ను మరింత స్ట్రాంగ్ గా ప్రేక్షకుల హృదయాల్లోకి చేర్చేలా ఉంది. మొత్తానికి దీవానా ఒక సాధారణ లవ్ స్టోరీ లాగా కాకుండా ఫీలింగ్ ను లోతుగా అన్వేషించే సినిమాగా నిలుస్తోందని ఈ స్టోరీ పోస్టర్ సూచిస్తోంది. మరి ఈ సినిమా హర్షిత్ రెడ్డిని నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తుందా లేదా అనేది చూడాలి.