ఓటీటీ రిలీజ్ ముంగిట థియేటర్ ట్విస్ట్?
గత ఏడాది ‘కోర్టు’ సినిమాలో చేసిన మంగపతి అనే విలన్ పాత్రతో శివాజీకి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.;
గత ఏడాది ‘కోర్టు’ సినిమాలో చేసిన మంగపతి అనే విలన్ పాత్రతో శివాజీకి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించినా.. ఈ స్థాయిలో ఆయన పేరు మార్మోగలేదు. ఈ ఒక్క సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవలే ‘దండోరా’ సినిమాలో కీలక పాత్రతో మరోసారి అరదగొట్టాడు శివాజీ. ఇప్పుడాయన లీడ్ రోల్‌లో ‘సంప్రదాయని సుప్పిని శుద్ధపూసని’ అనే సినిమా చేశారు.
ఇంతముందు శివాజీతో ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ తీసిన ఈటీవీ విన్ వాళ్లే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. గతంలో ‘మిస్సమ్మ’ సహా కొన్ని చిత్రాల్లో శివాజీకి జోడీగా నటించిన ఒకప్పటి కథానాయిక లయ ఇందులో.. ఆయనకు జోడీగా నటించింది. ఈ సినిమాను మొదలుపెట్టినపుడు థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత నిర్ణయం మారింది.
ఈ రోజు నుంచే ఈటీవీ విన్‌లో ‘సంప్రదాయని సుప్పిని శుద్ధపూసని’ని స్ట్రీమ్ చేయాలనుకున్నారు. దీన్ని వెబ్ ఫిలింగా పరిమితం చేయాలనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు రాలేదు. ‘సంప్రదాయని సుప్పిని శుద్ధపూసని’ ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్‌గా కనిపించింది. థియేటర్లలో కూడా రిలీజ్ చేయదగ్గ కంటెంట్ ఉన్న మూవీలా అనిపించింది.
టీం కూడా ఇదే ఆలోచనతో డిజిటల్ స్ట్రీమింగ్‌ను ఆపేసినట్లు సమాచారం. వచ్చే నెలలో మంచి డేట్ చూసుకుని సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. అక్కడ మంచి ఫలితం వస్తుందని.. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారట. ఐతే ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే ప్రకటించి ఉంటే బాగుండేది. డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ప్రచారం చేసి, తీరా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న టైంకి సైలెంట్‌గా నిర్ణయం మార్చేశారు. థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడన్నది కన్ఫమ్ చేశాక ఆ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.