హీరోయిన్ సింగింగ్ తో బై లింగువ‌ల్ బజ్

సింగింగ్, డ్యాన్సింగ్, లైవ్ ఇంటరాక్షన్స్, షార్ట్ వీడియోస్ వంటి అంశాలు ఇప్పుడు ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో కీలక భాగంగా మారుతున్నాయి.

Update: 2026-07-22 10:44 GMT

సినిమా ప్రమోషన్స్ విధానం గత కొన్నేళ్లలో పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకే పరిమితమైన ప్రమోష‌న్స్ ఇప్పుడు సోషల్ మీడియా కేంద్రంగా విస్తరించింది. ముఖ్యంగా ఆడియ‌న్స్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యే కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం పెరగడంతో హీరోయిన్లు కూడా కేవలం యాక్టింగ్ తోనే కాకుండా తమలోని వేరే టాలెంట్స్ ను కూడా బ‌య‌ట‌పెడుతూ సినిమాలకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా మారుతున్నారు.

సింగింగ్, డ్యాన్సింగ్, లైవ్ ఇంటరాక్షన్స్, షార్ట్ వీడియోస్ వంటి అంశాలు ఇప్పుడు ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో కీలక భాగంగా మారుతున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్‌కు తాజాగా చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్స్ మరో ఉదాహరణగా నిలిచాయి. ఈ సినిమా ప్రమోష‌న్స్ లో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలోని సాంగ్‌ను తెలుగు, తమిళ భాషల్లో ఆలపించి ఆడియ‌న్స్ దృష్టిని ఆకర్షించింది.

రెండు భాషలను ఒకే సాంగ్ లో క‌లిపి పాడ‌టం ద్వారా తెలుగు, తమిళ ఆడియ‌న్స్ తో ఒకేసారి బాండింగ్ ను పెంచే ప్రయత్నం చేసింది. బైలింగ్వల్ లేదా రెండు మార్కెట్లను టార్గెట్ గా పెట్టుకున్న సినిమాలకు ఇలాంటి ప్రమోషనల్ ఆలోచనలు మరింత ఉపయోగపడతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వేగంగా వైరల్ కావడం కూడా సినిమాపై అదనపు ఆసక్తిని తీసుకువస్తోంది.

ప్రస్తుతం హీరోయిన్ల కెరీర్‌లో మల్టీ టాలెంట్ ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా మారుతోంది. మంచి నటిగా ఉండటమే కాకుండా సింగింగ్, స్టేజ్‌పై ఫ్యాన్స్ ను అలరించడం, సోషల్ మీడియాలో నేచుర‌ల్ గా కమ్యూనికేట్ చేయడం వంటి నైపుణ్యాలు వారి ప‌ర్స‌న‌ల్ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి. దీంతో ఆడియ‌న్స్ కు వారు సినిమాల్లో కనిపించే పాత్రలకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్లుగా గుర్తుండిపోతున్నారు. గౌరీ ప్రియ కూడా అదే దిశగా తన ప్రత్యేక గుర్తింపును నిర్మించుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరహా ప్రమోషన్స్ సినిమా రిలీజ్‌కు ముందే పాజిటివ్ డిస్క‌ష‌న్ ను తీసుకురావడంతో పాటు, కొత్త తరం హీరోయిన్లు తమ టాలెంట్ ను విభిన్న కోణాల్లో ప్రదర్శించేందుకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.



Tags:    

Similar News