బన్నీ '42 రూల్స్'.. వంశీ నందిపాటి ఏమన్నారంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలని రీసెంట్ గా ఓ బ్రాండ్ స్ట్రాటజర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలని రీసెంట్ గా ఓ బ్రాండ్ స్ట్రాటజర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఓ యాడ్ కు గాను బన్నీతో పని చేసే సమయంలో తమ టీమ్ కు ముందుగానే కొన్ని రూల్స్ లిస్ట్ ఇచ్చారని ఆరోపించారు. పలువురు మేనేజర్ల ద్వారా వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
అయితే ఆమె కామెంట్స్ కు సంబంధించిన వీడియో క్లిప్ తో పాటు 42 రూల్స్ ఇవేనంటూ ఒక లిస్ట్ నెట్టింట చక్కర్లు కొట్టింది. అందులో కళ్లలోకి చూడకూడదని, షేక్ హ్యాండ్ చేయకూడదని, అనుమతి లేకుండా మాట్లాడకూడదని వంటి పలు రూల్స్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు షాక్ అవ్వగా.. మరికొందరు నిజమా కాదా అనే డౌట్ లో పడ్డారు.
దీంతో అల్లు అర్జున్ టీమ్ వెంటనే రెస్పాండ్ అయ్యి.. ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవాస్తవమని స్పష్టం చేసింది. “అల్లు అర్జున్ ఎల్లప్పుడూ అందరి పట్ల గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారు. ఆయన తాను పనిచేసే ప్రతి ఒక్కరితో కంఫర్ట్ గా ఉంటారు. ఆ తప్పుడు ప్రచారాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధ్యులపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీం సిద్ధంగా ఉంది” అని తెలిపింది
ఇక అల్లు అర్జున్ తో వర్క్ చేసిన పలువురు నటులు, టెక్నీషియన్లు కూడా స్పందించారు. సెట్స్ లో బన్నీ చాలా ఫ్రెండ్లీగా, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని తెలిపారు. ఎలాంటి ప్రత్యేక ప్రోటోకాల్స్ లేవని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. బన్నీపై వస్తున్న వార్తలు పూర్తిగా ఫేక్ అని తెలిపారు.
యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న హే భగవాన్ మూవీని ఆయన మరో నిర్మాత బన్నీ వాసుతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. అల్లు అర్జున్ పై వస్తున్న రూమర్స్ ను, సోషల్ మీడియా డిస్కషన్ పై క్లారిటీ ఇవ్వాలని ఓ మీడియా ప్రతినిధి ఆయనను కోరారు. అల్లు అర్జున్ తో చాలా క్లోజ్ గా ఉంటారన్న విషయాన్ని గుర్తు చేశారు.
దీంతో రెస్పాండ్ అయిన వంశీ నందిపాటి.. “ఇప్పుడే వెళ్దామన్నా హగ్ చేసుకుని మాట్లాడి రావొచ్చు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎలాంటి రూల్స్, కండిషన్స్ లేవు. అవన్నీ ఫేక్ వార్తలు” అంటూ మరోసారి రూమర్లకు చెక్ పెట్టారు. మొత్తానికి, సోషల్ మీడియాలో వైరల్ అయిన 42 రూల్స్ విషయంలో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ టీమ్ స్పష్టం చేయగా.. తాజాగా వంశీ నందిపాటి కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.