RRR నిర్మాత కనిపించట్లేదే..!

Update: 2023-03-01 17:43 GMT
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే RRR సినిమా ఇంటర్నేషనల్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఓ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం అందుకుంటుంది. అంతేకాదు ఆస్కార్ అవార్డ్ కి అడుగు దూరంలో ఉంది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ మూమెంట్ లో ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డివివి దానయ్య మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. RRR సినిమాకు డబ్బు పెట్టింది దానయ్యే. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇండియా రిలీజ్ బిజినెస్ అంతా ఆయనే చూసుకున్నారు.

ఎప్పుడైతే RRR సినిమాకు హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు వచ్చిందో అప్పటి నుంచి దానయ్య మిస్ అయ్యాడు. దర్శకుడు రాజమౌళి తన స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఆర్.ఆర్.ఆర్ ని ప్రమోట్ చేస్తున్నారని టాక్. దానికోసం పెద్ద మొత్తం లో తన జేబులోంచి ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే నిర్మాత పేరుని ఎక్కడ ప్రస్తావించలేదని. ఆర్.ఆర్.ఆర్ హాలీవుడ్ ప్రచారంలో డైరెక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా రాజమౌళి బాధ్యత వహిస్తున్నారని అంటున్నారు. అసలైతే అక్కడ ప్రచారానికి సంబంధించిన మొత్తన్ని కూడా ఒరిజినల్ నిర్మాత దానయ్య భరించాల్సి ఉంది. కానీ ఆయన మిడిల్ డ్రాప్ అవడమో లేక అంతగా ఆసక్తి చూపించకపోవడం తోనే రాజమౌళి యాక్షన్ లోకి దిగాడని తెలుస్తుంది.

ఎంత ఖర్చు పెట్టినా సరే ఆర్.ఆర్.ఆర్ లాంటి మూమెంట్ ఇండియన్ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమాకు మళ్లీ వస్తుంది అని చెప్పడం కష్టమే. అంతేకాదు ఆస్కార్ బరిలో కూడా RRR సాంగ్ నాటు నాటు నిలబడింది. అది కూడా వచ్చేస్తే మాత్రం ఇప్పుడు పెడుతున్న డబ్బులు పెద్ద లెక్క కాదని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి 100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాడని టాక్ ఉంది. అయితే ఆయన ఎంత ఖర్చు పెట్టినా హాలీవుడ్ రేంజ్ లో తనకు వస్తున్న ఈ గుర్తింపుకి ఆయన కోరినంత బడ్జెట్ ఇచ్చి సినిమా తీస్తారని చెప్పొచ్చు.

జపాన్ లో RRR సినిమా రిలీజ్ ను కూడా రాజమౌళి బలవంతం వల్లే అని తెలుస్తుంది. అక్కడ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ వసూళ్లతోనే గోల్డెన్ గ్లోబ్ కోసం రాజమౌళి అండ్ టీం ప్రచారం కోసం ఖర్చు పెట్టారని తెలుస్తుంది. దాదాపు గోల్డెన్ గ్లోబ్ అవార్డు టైం లో టికెట్లు, పార్టీలు, ప్రమోషన్స్ అన్ని 17 కోట్ల దాకా అయ్యాయని టాక్. ఆర్.ఆర్.ఆర్ ఈ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాక మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమాకు ఈజీగా గ్లోబల్ మార్కెట్ ఏర్పడుతుందని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆర్.ఆర్.ఆర్ సినిమా హాలీవుడ్ స్థాయిలో ప్రచారం జరుగుతుంటే నిర్మాతగా దానయ్య పేరు ఎక్కడ వినిపించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News