ఇది కూడా పుకారేనా మేడం...!
నోరా ఫతేహీ గతంలో ఆ సెలబ్రిటీతో ప్రేమలో ఉంది, ఈ సెలబ్రిటీని వివాహం చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల్లోనూ పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే.;
ఇండియన్ సినీ ప్రేమికులకు నోరా ఫతేహీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు కెనడియన్ అయినప్పటికీ ఇండియన్ సినీ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసింది. కేవలం హిందీ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సౌత్ సినిమాల్లోనూ కనిపించడం ద్వారా దేశ వ్యాప్తంగా ఈ అమ్మడికి గుర్తింపు లభించింది. సాధారణంగానే అందమైన హీరోయిన్స్‌కి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే నోరా ఫతేహీ అంతకు మించి అంటూ సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా మిలియన్‌ల కొద్ది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. ఈమె గురించిన ఏ చిన్న విషయం అయినా జాతీయ స్థాయిలో చర్చ జరగడం, జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో కవరేజ్ రావడం మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. ఈమె గురించి ఎక్కువగా ప్రేమ, పెళ్లి వార్తలు రావడం మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం.
సోషల్ మీడియాలో నోరా ఫతేహీ గురించి...
నోరా ఫతేహీ గతంలో ఆ సెలబ్రిటీతో ప్రేమలో ఉంది, ఈ సెలబ్రిటీని వివాహం చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల్లోనూ పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే. కానీ అవేవి నిజం కాదని పలు సార్లు నిరూపితం అయింది. పలు సార్లు తన గురించి వస్తున్న వార్తలను, ముఖ్యంగా ప్రేమ విషయాల గురించి వస్తున్న వార్తలు నిజం కాదని, అవి పుకార్లే అని చెప్పకనే చెబుతూ వచ్చింది. తాజాగా మరోసారి నోరా ఫతేహీ గురించి షాకింగ్ విషయం ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈమె ఫుట్‌బాల్ ఆటగాడు అచ్రాఫ్ హకీమి తో సన్నిహితంగా ఉంటుందని, అతడితో పలు చోట్ల కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు సైతం వస్తున్నాయి. ఆయనతో డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కావడంతో ఈ వార్తలు మరింతగా ఊపందుకున్నాయి. ప్రస్తుతానికి ఈ అమ్మడు ఈ విషయమై మౌనంగా ఉండటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఫుట్‌బాల్ ప్లేయర్‌తో ప్రేమాయణం...
మొరాకోలో ఇటీవల జరిగిన ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ కు నోరా ఫతేహీ హాజరు అయింది. ఆ సమయంలో అచ్రాఫ్ హకీమి తో ఆమె సన్నిహితంగా ఉన్నట్లుగా అనిపించిందని, పైగా దుబాయ్ లోనూ వీరిద్దరూ కనిపించారని, ఒక కార్యక్రమంలో కలిసి డాన్స్ చేశారు అంటూ చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్ని ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఏఐ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ కావడంతో నోరా ఫతేహీ డాన్స్ చేస్తున్న వీడియోలు నిజమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి చాలా రకాలుగా ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సమయంలో ఆమె అభిమానులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకు మీరు అతడితో క్లోజ్‌గా ఉంటున్నారు... ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందా అని ఆమెను డైరెక్ట్‌గా ప్రశ్నిస్తున్నారు.
కాంచన 4 సినిమాలో నోరా ఫతేహీ
గతంలో మీరు చాలా సార్లు ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో పుకార్లు అంటూ కొట్టి పారేశారు.. మరి ఈ సారి ఎందుకు ఈ విషయం గురించి వెంటనే స్పందించడం లేదు అంటూ వారు నోరాను ఆన్ లైన్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. కానీ ఆమె మాత్రం మౌనంగానే ఉంది. సరైన సమయంలో సమాధానం చెప్పడం కోసం ఆమె ఎదురు చూస్తుందేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది మాత్రం అతి త్వరలోనే నోరా నుంచి ఇది పుకారే అనే ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలు కాస్త తక్కువ కావడం వల్లే నోరా గురించి ఇలాంటి పుకార్లు వస్తున్నాయని, ఆమె తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉందని, త్వరలోనే ఆమె హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తుందనే ఆశాభావంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో ముఖ్యంగా కాంచన 4 సినిమాపై ఆమె ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.