కింగ్100లో కూలీ లుక్ లో నాగ్

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున ఆ త‌ర్వాత త‌న‌దైన స్టైల్ లో ఆ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.;

Update: 2025-12-30 03:00 GMT

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున ఆ త‌ర్వాత త‌న‌దైన స్టైల్ లో ఆ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. రొమాంటిక్ హీరోగా, ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా, యాక్ష‌న్, మాస్, భ‌క్తిర‌స చిత్రాలు మాత్ర‌మే కాకుండా అన్ని ర‌కాల జాన‌ర్ల‌లోనూ నాగ్ త‌నదైన ముద్ర వేసి స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి నాగ్ ఇప్పుడు త‌న కెరీర్లో మైల్ స్టోన్ ఫిల్మ్ అయిన 100వ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

100వ సినిమా కోసం నాగ్ స్పెష‌ల్ కేర్

వాస్త‌వానికి నా సామిరంగ సినిమా త‌ర్వాత నాగ్ వెంట‌నే త‌న 100వ సినిమాను చేయాల్సింది కానీ 100వ ప్రాజెక్టు కాబ‌ట్టి కాస్త జాగ్ర‌త్త తీసుకునే నేప‌థ్యంలో కాస్త ఆల‌స్య‌మైంది. అందుక‌ని నాగ్ ఈ గ్యాప్ లో ఖాళీగా లేరు. ఈ గ్యాప్ లో నాగ్ వేరే హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర చేయ‌డం, విల‌న్ గా క‌నిపించ‌డం, బిగ్ బాస్ లాంటివి చేస్తూ ఆడియ‌న్స్ కు అందుబాటులోనే ఉన్నారు.

కుబేర‌, కూలీ తో ఆక‌ట్టుకున్న నాగ్

రీసెంట్ గా కుబేర, కూలీ సినిమాల్లో న‌టించి తన యాక్టింగ్ తో అంద‌రినీ మెప్పించిన నాగ్, త‌న 100వ సినిమా విష‌యంలో చాలా ప్లాన్డ్ గా ఉన్నారు. ఈ మైల్ స్టోన్ ఫిల్మ్ కు కోలీవుడ్ డైరెక్ట‌ర్ రా కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, ఈ మూవీ షూటింగ్ పై ఓ అప్డేట్ తెలుస్తోంది.

కేర‌ళ‌లో కింగ్100

కింగ్100 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ కేర‌ళ‌లో ఉంటుంద‌ని స‌మాచారం. రీసెంట్ గా వ‌చ్చిన కూలీ సినిమాలో నాగ్ ఎలాంటి హెయిర్ స్టైల్ తో అయితే క‌నిపించారో ఇప్పుడీ సినిమాలో కూడా అదే హెయిర్ స్టైల్ తో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. కాగా ఈ మూవీకి లాట‌రీ కింగ్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. మ‌రి ఈ సినిమా ఏ జాన‌ర్ లో రానుంది? మిగిలిన విష‌యాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

Tags:    

Similar News