ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారేం...?

Update: 2020-09-20 14:00 GMT
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోలతో సమానంగా క్రేజ్ ఏర్పరచుకుంది. 'అరుంధతి' 'భాగమతి' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో చూపించింది. ఇక 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ బొమ్మాళీ. ఈ క్రమంలో అనుష్క సినిమా అంటే ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతూ వచ్చింది. అయితే అనుష్క లేటెస్ట్ మూవీ విషయంలో మాత్రం ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా అనుష్క - మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ''నిశ్శబ్దం'' సినిమా కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఎప్పుడో జనవరిలో రిలీజ్ కావాల్సిన సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. లాక్ డౌన్ సమయంలో సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్న నేపథ్యంలో ఇన్నాళ్లకు అనుష్క 'నిశ్శబ్దం' చిత్రాన్ని కూడా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు తమిళ భాషలతో పాటు మలయాళ డబ్బింగ్ వర్షన్ ని స్ట్రీమింగ్ కి పెడుతున్నారు.

సాధారణంగా అనుష్క సినిమా అంటే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిపోయి మూవీకి హైప్ వచ్చేది. కానీ అనేక వాయిదా పడటం వల్లనో ఏమో 'నిశ్శబ్దం' పట్ల ప్రేక్షకులు నిశబ్దంగా ఉన్నారనే టాక్ వచ్చింది. సినిమా రిలీజ్ అవడానికి పది రోజులే ఉంది కాబట్టి ప్రమోషన్స్ చేసి 'నిశ్శబ్దం' గురించి గట్టిగా అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 21న ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇంటర్వూస్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే ఓటీటీ రీచ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి 'నిశ్శబ్దం' టీమ్ నిశబ్దంగా ఎలాంటి ప్లాన్స్ చేసుకుంటున్నారో చూడాలి.

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ మరియు కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. అంజలి - షాలిని పాండే - మైఖేల్ మ్యాడ్స‌న్ - సుబ్బ‌రాజు - శ్రీనివాస అవ‌స‌రాల‌ - హంట‌ర్ ఓ హ‌రో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించగా జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.
Tags:    

Similar News