మరాఠీ బ్యూటీకి సూపర్ ఛాన్స్.. ఫస్ట్ హిట్ అక్కడేనా దక్కుతుందా?

మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌ లోకి మిస్టర్ బచ్చన్‌ సినిమాతో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.;

Update: 2026-04-10 19:30 GMT

మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌ లోకి మిస్టర్ బచ్చన్‌ సినిమాతో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే అందం, నేచురల్ యాక్టింగ్, తెరపై ఆమె చూపించే కాన్ఫిడెన్స్‌ వల్ల యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కిందనే చెప్పాలి. కెరీర్ ప్రారంభంలోనే పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కడం ఆమెకు ప్లస్‌ పాయింట్ గా మారింది.

అయితే ఇప్పటివరకు కమర్షియల్‌ గా పెద్ద హిట్ మాత్రం ఆమె ఖాతాలో పడకపోవడం గమనార్హం. భాగ్యశ్రీ నటించిన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్‌ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి చేసిన కింగ్‌ డమ్ కూడా మిశ్రమ స్పందనకే పరిమితమైంది. భారీ విజయాన్ని అందుకోకపోయినా, భాగ్యశ్రీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తర్వాత రామ్ పోతినేనితో కలిసి నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాలో తన యాక్టింగ్ తో ఫిదా చేసిందనే చెప్పాలి. ఆ సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోయినా, భాగ్యశ్రీపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. అలాగే కాంత సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ, ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో కమర్షియల్ హిట్ కోసం ఆమె వెయిట్ చేస్తున్నారు.

హిట్స్ లేకపోయనా.. వరుసగా అవకాశాలు మాత్రం వస్తుండటం మాత్రం గమనార్హం. గ్లామర్‌ తో పాటు ఎమోషన్స్ ను సరైన రీతిలో పండించే టాలెంట్ ఉండడంతో దర్శకనిర్మాతలు ఆమెను అప్రోచ్ అవుతున్నారు. అందుకే వరుస ప్రాజెక్టుల్లో ఆమెకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు భాగ్యశ్రీ తన కెరీర్‌ లో కొత్త మలుపు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వడానికి ఆమె సిద్ధమవుతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న కొత్త చిత్రం సెయాన్ లో ఆమె హీరోయిన్‌ గా నటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం.

దర్శకుడు శివకుమార్ తెరకెక్కిస్తున్న ఆ ప్రాజెక్ట్‌ పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్‌ గా ఎంపికైందన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అలా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న భాగ్యశ్రీకి కోలీవుడ్ మంచి బ్రేక్ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. భారీ బ్యానర్, స్టార్ హీరో, మంచి కథ.. కలిసి వస్తే భాగ్యశ్రీకి తొలి కమర్షియల్ సక్సెస్ దక్కే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో తెలుగులో కూడా పలు సినిమాల్లో నటిస్తున్న అమ్మడు.. ఫస్ట్ కమర్షియల్ హిట్ ఎక్కడ అందుకుంటుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News