స్టార్ట‌ప్ స్టోరీతో వస్తున్న ఆమిర్ ఖాన్.. బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ స్టార్ట్?

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మళ్లీ పెద్ద తెరపై సాలిడ్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.;

Update: 2026-04-10 22:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మళ్లీ పెద్ద తెరపై సాలిడ్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో, ఈసారి ఆయన ఒక పెద్ద హిట్‌తో తిరిగి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు గణనీయంగా పెరిగాయి.

స్టార్ట‌ప్ వ‌ర్ల్డ్ బ్యాక్ డ్రాప్ లో..

ఈ సినిమా స్టార్ట‌ప్ ప్రపంచాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుంటుందన్న వార్త‌లు ప్రాజెక్టుపై మ‌రింత ఆసక్తిని పెంచుతున్నాయి. యూత్ లో వేగంగా పెరుగుతున్న ఎంట్రప్రెన్యూర్‌షిప్ ట్రెండ్‌ను ప్రతిబింబించేలా కథ ఉండబోతుందనే ప్రచారం ఉంది. ఈ యాంగిల్ లో చూస్తే, బాలీవుడ్‌లో కొత్త తరహా కథలకి ఇది నాంది కావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ట్‌ప్ కలలతో ముందుకు సాగుతున్న జెన్Z ఆడియ‌న్స్ కు ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు..

కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా, కంటెంట్‌కు ప్రాధాన్య‌మిచ్చే సినిమాలు చేయడంలో ఆమిర్ ఖాన్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు తెలిసిందే. ఈ సినిమా కూడా కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా ఉండబోతుందన్న సంకేతాలున్నాయి. గతంలో తన కథల ఎంపికతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన, ఈ సినిమాతో మరోసారి కంటెంట్ కింగ్ గా నిలుస్తారా అన్న ఆసక్తి నెలకొంది.

హీరోయిన్ గా శ్ర‌ద్ధా క‌పూర్

రాహుల్ మోడీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ఇదొక ఫ్రెష్ కాంబినేషన్ కావడం వల్ల సినిమాపై మరింత కుతూహలం ఏర్పడింది. కొత్త ఆలోచనలతో, విభిన్న కథన శైలితో ఈ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా శ్ర‌ద్ధా క‌పూర్ పేరు వినిపించడం మరో హైలైట్. వీరిద్ద‌రూ తొలిసారిగా క‌లిసి న‌టించ‌నుండ‌టంతో, స్క్రీన్‌పై వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ ఓ క్విర్కీ, అన్‌కన్వెన్షనల్ స్టార్ట‌ప్ థింకర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇలాంటి విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం తెలిసిందే. మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను మెప్పిస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయనకు ఒక పెద్ద హిట్ అవసర‌మ‌ని అత‌ని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఎప్పటిలాగే ఆమిర్ ఖాన్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడబోరన్న సంకేతాలున్నాయి. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, రిలీజ్ టైమ్ ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News