తిన్నారా? లేదా? అని అడిగే గొప్ప మ‌న‌సున్న జోడీ!

లేడీ సూప‌ర్ స్టార్ నయనతార తెరపై క‌నిపించినా? లేదా పబ్లిక్ ఈవెంట్లలో గమనించినా ? అమ్మ‌డు ఆమె చాలా గంభీరంగా, సీరియస్‌గా కనిపిస్తుంది.;

Update: 2026-04-10 17:30 GMT

లేడీ సూప‌ర్ స్టార్ నయనతార తెరపై క‌నిపించినా? లేదా పబ్లిక్ ఈవెంట్లలో గమనించినా ? అమ్మ‌డు ఆమె చాలా గంభీరంగా, సీరియస్‌గా కనిపిస్తుంది. త్వరగా ఎవరితోనూ కలవరనే విమ‌ర్శ కూడా ఉంది. అయితే ఇది కేవలం ఆమె వ్యక్తిగత క్రమశిక్షణ మాత్రమేనని వాస్తవానికి ఆమె మనసు వెన్న అని న‌య‌న్ తో పని చేసిన వారు చెబుతున్నారు. షూటింగ్ సెట్‌లో తన కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని వారు చిన్న ఆర్టిస్ట్ అయినా లేదా లైట్ బాయ్ అయినా సరే లంచ్ స‌మ‌యంలో? తిన్నారా? లేదా? అని ఎంతో ఆత్మీయంగా పలకరించడం నయన్ దంపతులకు ఉన్న ఒక గొప్ప అలవాటని తాజాగా వెల్లడైంది.

నయనతార మాత్రమే కాదు. ఆమె భర్త విగ్నేష్ శివన్ కూడా ఇదే తరహా స్వభావాన్ని కలిగి ఉంటాడుట‌. సాధారణంగా స్టార్ హీరోలు లేదా హీరోయిన్లు కారవాన్లకే పరిమితమవుతుంటారు. కానీ ఈ జోడీ మాత్రం సెట్‌లోని వాతావరణం అందరికీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటారుట‌. ఎవరైనా ఆకలితో పని చేయడం వారికి అస్సలు నచ్చదని అందుకే యూనిట్ సభ్యుల భోజన వసతులపై వారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారఠ‌. ఒక టాప్ స్టార్ హోదాలో ఉండి కూడా కింది స్థాయి సిబ్బంది క్షేమ సమాచారాలు అడగడం వారి గొప్ప మ‌న‌సుకు తార్కాణం.

నయనతార సీరియస్ లుక్ వెనుక ఉన్న అసలు కారణం ఆమె పని పట్ల చూపే అంకితభావమే. సెట్‌లో అనవసరమైన మాటలు మాట్లాడకుండా తన పనిపై దృష్టి పెట్టడం వల్ల ఆమె గంభీరంగా కనిపిస్తారు. కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించడంలో ఆమె ముందుంటారని పలువురు సాంకేతిక నిపుణులు గుర్తు చేసుకుంటున్నారు. విగ్నేష్ శివన్ సైతం సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటారని, వీరిద్దరి కలయిక సెట్‌ను ఒక కుటుంబంలా మార్చేస్తుందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

అలాగే సమాజ సేవలోనూ దంపతులు తమదైన శైలిలో ముందుంటారు. బయటకు చెప్పుకోకుండా ఎంతోమంది పేద విద్యార్థులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తుంటారు. తాము సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు పంచాలనే ఆలోచనా దృక్పథం వారిని నిజమైన పవర్ కపుల్ గా నిలబెడుతుంది. తెరపై కనిపించే గ్లామర్ కంటే తెర వెనుక వారు చూపే మానవత్వమే వారిని అభిమానులకు మరింత దగ్గర చేస్తోంది.

సినిమా రంగంలో విజయం సాధించడం కంటే మనుషుల మనసు గెలవడం గొప్ప విషయం. నయనతార, విగ్నేష్ శివన్ ఆ విషయంలో నూటికి నూరు మార్కులు సాధించారు. పైకి సీరియస్‌గా కనిపించినా? లోపల అందరి క్షేమాన్ని కాంక్షించే గొప్ప మనసు నయనతార సొంతం. ఇలాంటి చిన్న చిన్న పలకరింపులే పని చేసే చోట ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మిగిలిన స్టార్స్ కూడా వీరిని చూసి నేర్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News