హ్యాట్రిక్ ప్లాన్ చేసిన న‌యా డైరెక్ట‌ర్!

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఆనంద్ ఎల్ రాయ్ కథల్లో భావోద్వేగాలకు, మానవ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.;

Update: 2026-04-10 18:30 GMT

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఆనంద్ ఎల్ రాయ్ కథల్లో భావోద్వేగాలకు, మానవ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేయడమే కాదు. ఆయనలోని నటుడిని విభిన్న కోణాల్లో ఆవిష్కరించిన ఘనత ఈయనదే. వీరిద్దరి కలయికలో తెర‌కెక్కిన ఆత్రంగిరే మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రంగానూ నిల‌చింది. అదే కాన్పిడెన్స్ తో తేరే ఇష్క్ మే చిత్రాన్ని కూడా గ‌త ఏడాది రిలీజ్ చేసి మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఈ నేప‌త్యంలో ఆనంద్ ఎల్ . రాయ్ అదే హీరోతో హ్యాట్రిక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా మ‌రోసారి కృతి శెట్టినే రిపీట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆనంద్ ఎల్ రాయ్ గతంలో నిర్మించిన కొన్ని ప్రాజెక్టులతో కృతికి మంచి అనుబంధం ఉంది. తేరే ఇష్క్ మే లో కూడా ఈ భామ‌నే ధ‌నుష్ కు జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌రోసారి ఆ భామ‌కే ఛాన్స్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం కృతి సనన్ నటనతో , గ్లామర్‌తో మంచి ఫామ్‌లో కొన‌సాగుతోంది. ధనుష్ సహజ న‌ట‌న‌కు కృతి స‌న‌న్ పెర్పార్మెన్స్ తోడైందంటే అది పీక్స్ లో ఉంటుంది.

అందుకే మ‌రోసారి వారిద్ద‌రినీ ఒకే తాటిపైకి తెస్తున్నారు. ఇదీ ప్యూర్ ల‌వ్ స్టోరీ అని స‌మాచారం. ఈ ఏడాది చివ‌ర్లోనే చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని ఆనంద్ భావిస్తున్నారుట‌. అలాగే ఆనంద్ ఎల్ రాయ్ సినిమాల్లో సంగీతానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ధనుష్ చిత్రాలకు ఏఆర్ రెహమాన్ అందించిన బాణీలు గతంలో చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. ఈ హ్యాట్రిక్ ప్రాజెక్టు కోసం కూడా భారీ మ్యూజికల్ టీమ్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఒక సాధారణ ప్రేమకథను కూడా అసాధారణమైన అనుభూతిగా మలచడంలో ఆయన దిట్ట.ఈసారి కూడా సరికొత్త నేపథ్యాన్ని, బరువైన ఎమోషన్స్‌ను కథ కోసం సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఒకే హీరో, ఒకే దర్శకుడు వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారంటే ?వారి మధ్య ఉన్న వృత్తిపరమైన అవగాహన ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధనుష్ ఇచ్చే ఇన్‌పుట్స్, ఆనంద్ ఎల్ రాయ్ రాసుకునే పాత్రలు ఒకదానికొకటి తోడై బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయి. కృతి సనన్ చేరికతో ఈ ప్రాజెక్టుకు గ్లామర్ తో పాటు కమర్షియల్ హంగులు కూడా తోడయ్యాయి. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేమకథలకు సరికొత్త నిర్వచనం ఇవ్వాలని చిత్ర బృందం భావిస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల హవా నడుస్తున్న తరుణంలో ఆనంద్ ఎల్ రాయ్ వంటి దర్శకులు ప్యూర్ లవ్ స్టోరీలను నమ్ముకోవడం విశేషం. ప్రేక్షకులు కూడా భారీ యాక్షన్ డ్రామాల మధ్య ఇలాంటి హృద్యమైన చిత్రాలను ఆదరిస్తున్నారు. ధనుష్-ఆనంద్ ఎల్ రాయ్ జోడీకి ఉన్న క్రేజ్ కార‌ణంతో అప్పుడే బిజినెస్ వర్గాల్లో డిమాండ్ మొద‌లైంది.

Tags:    

Similar News