ఆ మ్యాకప్ ఆర్టిస్ట్ గర్విష్టి -ఖరీదైనది అన్నారు!
సినిమా పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి విన్న మాటలు వారి అసలు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించవని `ధురందర్` దర్శకుడు ఆదిత్య ధర్ తాజాగా నిరూపించారు.;
సినిమా పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి విన్న మాటలు వారి అసలు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించవని `ధురందర్` దర్శకుడు ఆదిత్య ధర్ తాజాగా నిరూపించారు. ఈ సినిమా కోసం మేకప్ ఆర్టిస్ట్ ప్రీతిశీల్ సింగ్‌ను ఎంపిక చేసుకునే సమయంలో ఆమె చాలా గర్విష్టి అని, ఆమె పారితోషికం భారీగా డిమాండ్ చేస్తారని కొందరు ఆదిత్యను హెచ్చరిం చారట. ఆ మాటలు విని మొదట ఆమెను తీసుకోవడానికి ఆదిత్య కూడా వెనుకాడాడు. కానీ ఆమె ప్రతిభను నమ్మి ధైర్యంగా ముందుకెళ్లి సక్సెస్ అయ్యారు. అయితే పని మొదలుపెట్టిన తర్వాత ఆమెలోని అసలు మంచితనం, వృత్తి పట్ల ఉన్న నిబద్ధత చూసి ఆదిత్య ఆశ్చర్యపోయానన్నారు.
ప్రీతిశీల్ సింగ్ ఆమె టీమ్ ఈ సినిమా కోసం పడిన శ్రమ వర్ణనాతీతం. షూటింగ్ సమయంలో వారు రోజుకు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారని ఆదిత్య వెల్లడించారు. మిగిలిన సమయమంతా నటుల రూపురేఖలను మార్చడంలో క్లిష్టమైన ప్రాస్థెటిక్స్‌ను సిద్ధం చేయడంలోనే గడిపేవారన్నారు. వేల సంఖ్యలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు, ప్రధాన నటులకు మేకప్ వేయడం అనేది ఒక యజ్ఞంలా సాగింది. ఈ స్థాయి అంకితభావం వల్లే సినిమాలో ప్రతి పాత్ర అత్యంత సహజంగా, ప్రభావవంతంగా కనిపిస్తోందన్నారు.
ప్రీతిశీల్ కేవలం ఒక మేకప్ ఆర్టిస్ట్ మాత్రమే కాదని గొప్ప విజనరీ అని ఆదిత్య కొనియాడారు. రణవీర్ సింగ్, సంజయ్ దత్ వంటి స్టార్ల లుక్స్ విషయంలో ఆమె చూపించిన సృజనాత్మకత సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇతరులు చెప్పే నెగటివ్ మాటలను బట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని ప్రీతిశీల్ తన టీమ్ మొత్తాన్ని ఒక కుటుంబంలా నడిపిస్తూ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిందని ఆయన ప్రశంసించారు. ఆమె గర్విష్టి కాదని, పని పట్ల కచ్చితత్వం ఉన్న వ్యక్తి అని ఆదిత్యధర్ స్పష్టం చేశారు.
భారీ బడ్జెట్ సినిమా విజయం సాధించాలంటే దర్శకుడు, హీరోలు మాత్రమే సరిపోరు. తెర వెనుక ఉండే ఇలాంటి అన్‌సంగ్ హీరోల శ్రమ చాలా కీలకమని ఆదిత్య ధర్ తన పోస్ట్ ద్వారా చాటి చెప్పారు. ప్రీతిశీల్ టీమ్ పడిన కష్టం బాక్సాఫీస్ వసూళ్లలో ప్రతిబింబిస్తోంది. కేవలం డబ్బు కోసమే కాకుండా అద్భుతమైన కళాఖండాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపన వారిలో కనిపించిందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక నిపుణుల కష్టాన్ని గుర్తించి గౌరవించే ఆదిత్య ధర్ మనస్తత్వాన్ని కూడా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ప్రీతిశీల్ సింగ్ ప్రయాణం ఇండస్ట్రీలోని ప్రతి టెక్నీషియన్‌కు ఒక స్ఫూర్తి. తనపై ఉన్న విమర్శలను తన పనితోనే తిప్పికొట్టి, దర్శకుడి ప్రశంసలు అందుకున్నారు. వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఘనతలో ఆమె నిద్రలేని రాత్రుల శ్రమ దాగి ఉంది. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రతిభను నమ్మి అవ కాశం ఇస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో `ధురందర్` టీమ్ నిరూపించింది.