'డార్క్ చాక్లెట్' ట్రైలర్.. ఇదొక అన్‌ ఫిల్టర్డ్ సినిమాటిక్ ట్రిప్!

సినిమా అంటే నవ్వులు, లవ్, ఫ్యామిలీ ఎమోషన్సే కాదు.. కొన్నిసార్లు ప్రేక్షకులు ఊహించని కథలు కూడా ఉంటాయి.

Update: 2026-10-25 10:55 GMT

సినిమా అంటే నవ్వులు, లవ్, ఫ్యామిలీ ఎమోషన్సే కాదు.. కొన్నిసార్లు ప్రేక్షకులు ఊహించని కథలు కూడా ఉంటాయి. అలాంటి కొత్త ప్రయత్నంతో వస్తున్న చిత్రమే 'డార్క్ చాక్లెట్'. రీసెంట్ గా రిలీజైన ఆ సినిమా ట్రైలర్ చూస్తే.. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, ఎలాంటి హద్దులు లేకుండా కథను చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బోల్డ్ కామెడీ, వింత రోల్స్, కొత్త తరహా సీన్స్ తో ఆ సినిమా హైప్ పెంచుతోంది.




 


నిజానికి టాలీవుడ్‌ లో కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రానా దగ్గుబాటి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆయన సమర్పణలో వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఇదే విషయాన్ని చూపించాయి. ఇప్పుడు వాల్తేరు ప్రొడక్షన్స్‌ తో కలిసి నిర్మించిన 'డార్క్ చాక్లెట్'తో మరోసారి కొత్త రకమైన కథను తీసుకొస్తున్నారు. బిందు మాధవి, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాకు శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు.

అయితే ఆ మూవీ మొదటి నుంచీ కంటెంట్‌ తోనే హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో విడుదల చేసిన పోస్టర్‌లోనే తమ సినిమా ఏ జోనర్‌ కు చెందుతుందో చెప్పలేమనే అర్థం వచ్చేలా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన టీజర్ కూడా సాధారణ సినిమాలకు భిన్నంగా కనిపించింది. ఇప్పుడు ట్రైలర్‌ తో ఆ స్పెషాలిటీని మరింత క్లియర్ గా కనిపించింది. బోల్డ్ డైలాగులు, అడల్ట్ కామెడీ, డార్క్ హ్యూమర్‌తో ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్‌ లో కనిపించే సీన్స్ బట్టి చూస్తే.. సినిమా కథను నార్మల్ పద్ధతిలో చెప్పడం లేదని అర్థమవుతోంది. 'ఫైర్ స్టార్' అనే ఎలిమెంట్ చుట్టూ సాగే కథలో స్టార్ కల్చర్‌ ను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కథలో అసలు ఏముంది, రోల్స్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, చివరకు సినిమా ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుందనే విషయాలను మూవీ టీమ్ వెల్లడించలేదు. దీంతో సినిమా మీద ఆసక్తి పెరిగింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. బిందు మాధవి, విశ్వదేవ్ రాచకొండ తమకు అలవాటైన పాత్రలకు భిన్నంగా కనిపిస్తున్నారు. రాకేష్ రాచకొండ, ఆది పెద్దిరెడ్డి కూడా కీలక పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కౌర్ ట్రైలర్‌ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సీన్స్ కు తగ్గట్టుగా వినిపించే మ్యూజిక్ సినిమా మూడ్‌ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. అన్‌ ఫిల్టర్డ్ సినిమాటిక్ ట్రిప్ గా మూవీ ఉండన్నట్లు అర్థమవుతోంది.

అయితే చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు నవంబర్ 13న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ రీసెంట్ గా ప్రకటించారు. స్పిరిట్ మీడియా ద్వారా రానా దగ్గుబాటి ఆ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. మరి ట్రైలర్‌ లో కనిపించిన కొత్తదనం సినిమా అంతటా ఉంటుందా, స్టోరీ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటుందా అన్నదే చూడాలి.



Full View


Tags:    

Similar News