మెగా ఫ్యామిలీ కనీసం రెస్పాండ్ అవ్వలేదన్న వర్మ ఫిల్మ్ మేకర్
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సీనియర్ జర్నలిస్ట్ ప్రభు సినిమా తీశాడు. నేడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా ప్రకటించిన సమయంలో చాలా మంది నాకు వెనుక నుండి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిందని అన్నారు. వారి సహకారంతోనే నేను ఈ సినిమాను తీస్తున్నట్లుగా భావించారు. కాని నాకు మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి సహాయ సహకారం అందలేదు. కనీసం నేను వర్మపై సినిమాను తీస్తున్నట్లుగా చెప్పేందుకు చిరంజీవి.. పవన్ కళ్యాణ్ మరియు చరణ్ లను కలిసేందుకు ప్రయత్నించాను కాని వారు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు అన్నాడు.
వర్మ గురించి నేను సినిమా తీయడానికి ప్రధాన కారణం అతడి వల్ల సామాజిక కాలుష్యం ఏర్పడుతుంది. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్నాడనో లేదా పవన్ కళ్యాణ్ ను తిడుతాడో అనో నేను ఈ సినిమాను తీయలేదు. నా వద్ద డబ్బు లేకున్నా కూడా బ్యాంక్ నుండి లోను తీసుకుని ఈ సినిమాను తీశాను. లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా ఈ సినిమాను నేను తీశాను. ఒక వ్యక్తిని నా సినిమా ద్వారా మార్చాలని నేను భావించాను. అందుకోసం మాత్రమే ఈ సినిమాను తీశాను తప్ప ఎవరి మద్దతు కాని సహకారం కాని నాకు అందలేదని దర్శక నిర్మాత ప్రభు క్లారిటీ ఇచ్చాడు.
మీడియా రంగంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న నేను ఒక అమ్మాయి చేసిన వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీ వారు ఎంతగా ఇబ్బంది పడ్డారు.. ఆ అమ్మాయి విషయంలో వర్మ చేసింది ఏంటీ అనే విషయాలను తాను సినిమాలో చూపిస్తానంటూ పేర్కొన్నాడు. మెగా ఫ్యామిలీకి తాను రూపొందించిన రామ్ గోపాల్ వర్మ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ప్రభు క్లారిటీ ఇచ్చాడు. ఎవరో ఇచ్చిన ప్యాకేజీతో నేను సినిమా చేయలేదు. 32 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను. నైతిక విలువలతో నేను ముందుకు వెళ్తున్నాను అంటూ పేర్కొన్నాడు.