తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ ను పక్కనబెట్టారా?
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఓ భారీ సోషియో ఫాంటసీ చిత్రం అనిశ్చితిలో పడినట్లు తెలుస్తోంది.;
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఓ భారీ సోషియో ఫాంటసీ చిత్రం అనిశ్చితిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ సహా కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న సినిమా అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా పక్కన పెట్టబడినట్లు తాజాగా సినీ వర్గాల్లో చర్చకొచ్చింది. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావించిన మేకర్స్ ప్రస్తుతానికి పనులను నిలిపివేసి భవిష్యత్తు ప్రణాళికపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వాయిదా పడటానికి ప్రధాన కారణం గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జరుగుతోన్న జాప్యమేనని భావిస్తున్నారు.
ఊహకందని భారీ సెట్టింగులు, అద్భుతమైన విజువల్స్ ఉండాల్సిన ఈ కథలో క్వాలిటీ విషయంలో రాజీ పడితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది. అందుకే హడావుడిగా సినిమాను పూర్తి చేయడం కంటే కొంత విరామం తీసుకుని పక్కా అవుట్‌పుట్‌తో రావడమే మంచిదని చిత్ర బృందం భావిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సదరు సీనియర్ స్టార్ హీరో కూడా తదుపరి సినిమాలపై దృష్టి సారించడం కూడా ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టడానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా కోసం చాలా సమయం కేటాయించిన ఆయన దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉండటంతో ఈలోపు మరో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్ట్ ను పూర్తి చేసి రిలీజ్ చేస్తే తప్ప పాత ప్రాజెక్ట్ పై టైమ్ వేస్ట్ చేయకూడదని భావిస్తున్నారుట. అయితే ఈ వార్తలు కేవలం ప్రచారం మాత్రమే. ప్రాజెక్ట్ పక్కన పెట్టలేదని కొందరు సన్నిహిత వర్గాలు వాదిస్తున్నాయి. సినిమా స్థాయి పెద్దది కావడంతో తదుపరి పనులకు కొంత సమయం పడుతోందని త్వరలోనే మళ్ళీ ఆగిపోయిన పనులు పున ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ గందరగోళం మధ్య అధికారికంగా మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానుల్లో మరింత ఆందోళన పెరుగుతోంది.
భారీ బడ్జెట్ - భారీ అంచనాలున్న సినిమాలు ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కో వడం సహజమే. సాంకేతిక కారణాలు సహా ఇతర సమస్యల వల్ల విరామం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఓ అద్భుతమైన ఫాంటసీ కథను వెండితెరపై చూడాలని కోరుకునే సగటు సినిమా ప్రేక్షకుడు మాత్రం ఈ సందిగ్ధత తొలగి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నారు. మరి ఆ కోరిక 2026 లో నెరవేరుతుందా? 2027లో తీరుతుందా? అన్నది చూడాలి.