మైండ్‌సెట్‌లో మార్పు - షార్ట్ అండ్ స్వీట్ రోల్స్!

పరిశ్రమలో హీరోయిన్ల ఆలోచనా ధోరణిలో విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కథానాయికలు అంటే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఫ్రేమ్‌లోనూ ఉండాలనుకునేవారు.;

Update: 2026-04-25 01:30 GMT

పరిశ్రమలో హీరోయిన్ల ఆలోచనా ధోరణిలో విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కథానాయికలు అంటే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఫ్రేమ్‌లోనూ ఉండాలనుకునేవారు. కనీసం నాలుగైదు పాటల్లో మెరవాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోంది. పాత్ర నిడివి ఎంత అన్నది కాకుండా ఆ పాత్ర కథను ఎంత వరకు ప్రభావితం చేస్తోంది? ఆ ప్రాజెక్ట్ వల్ల తమ వ్యక్తిగత బ్రాండ్ వాల్యూ ఎంత పెరుగుతుంది? అనే అంశాలకే భామలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కొత్త మైండ్‌సెట్‌కు `కల్కి 2898 ఏడీ` చిత్రంలో దిశా పటాని పోషించిన రోక్సీ పాత్ర ఓ ఉదాహరణ. సినిమాలో దిశా ప‌టానీ కనిపించేది కొద్దిసేపే అయినా? ఆ ప్రాజెక్ట్ సాధించిన అంతర్జాతీయ విజయం ఆమెకు గ్లోబల్ విజిబిలిటీని తెచ్చిపెట్టింది.

నిడివి తక్కువైనా అగ్ర హీరో సరసన ఒక భారీ విజువల్ వండర్‌లో భాగమవ్వడంతో కెరీర్‌కు లభించే మైలేజ్ ఎక్కువని దిశా వంటి తారలు భావిస్తున్నారు. ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ రోల్స్ ఇప్పుడు హీరోయిన్లకు సేఫ్ అండ్ స్మార్ట్ బెట్స్‌గా మారుతున్నాయి. నయనతార, శృతి హాసన్ వంటి సీనియర్ తారలు కూడా ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్నారు. యష్ నటిస్తోన్న `టాక్సిక్` చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో పోషిస్తుంది. అలాగే `పెద్ది` వంటి భారీ చిత్రాలలో శృతి హాసన్ పాత్ర పరిధి తక్కువైనా? ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ తమ మార్కెట్ వాల్యూని నిలబెడుతుందని నమ్ముతున్నారు.

రష్మిక మందన్నా కూడా కేవలం మెయిన్ లీడ్ పాత్రలకే పరిమితం కాకుండా కథలో ప్రాధాన్యత ఉంటే స్పెషల్ అప్పియరెన్స్‌లు లేదా అతిథి పాత్రలు చేయడానికి వెనుకా డటం లేదు. `సీతారామం`లో చిన్న పాత్ర అమ్మ‌డికి ఎంత గుర్తింపును తెచ్చి పెట్టిందో తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కు ముందు స్టార్ అయిన ర‌ష్మిక అలాంటి పాత్ర పోషించ‌డం ఏంటి? అనే విమ‌ర్శ వ్య‌క్త‌మైంది. కానీ సినిమా రిలీజ్ త‌ర్వాత అదే విమ‌ర్శ భారీ ప్ర‌శంస‌గా మారిపోయింది. ఈ మార్పు వెనుక ఉన్న ఓ కారణం కూడా క‌నిపిస్తోంది. బ్రాండ్ వాల్యూ తో సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు నిరంతరం వార్తల్లో ఉండటం ముఖ్యం.

ఏళ్ల తరబడి ఒకే సినిమా కోసం ఎదురు చూడటం కంటే భారీ బడ్జెట్ సినిమాల్లో చిన్న పాత్రలైనా చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉండటం తో విదేశీ బ్రాండ్లు , గ్లోబల్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హీరోయిన్లు ఇప్పుడు స్క్రీన్ టైమ్ కంటే సినిమా స్కేల్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. హీరోయిన్లు గ్లామర్ డాల్స్ గా మిగిలిపోవాలని అనుకోవడం లేదు. తక్కువ సమయంలోనే నటనతో , స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు. ఈ తరహా ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ ట్రెండ్ భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలకు, వైవిధ్యమైన కథలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. పాత్ర చిన్నదైనా? అది ఇచ్చే హైప్ పెద్దదైతే చాలు అనేదే నేటి తారల సక్సెస్ మంత్రంగా మారిపోయింది.

Tags:    

Similar News