• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'థాంక్యూ'కోసం అంతటి...

'థాంక్యూ'కోసం అంతటి రిస్క్ చేసాం: రాశిఖన్నా

By - Tupaki Desk
Update: 2021-05-29 09:51 GMT
సినీ ప్రపంచంలో నేటితరం హీరోయిన్స్ మూవీకోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. అందులో భాగంగా అన్నిటికంటే ముందుగా ఫిట్నెస్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి గ్లామర్ ప్రపంచంలో పోటీని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ తప్పనిసరి. అందుకే ఒకప్పుడు బొద్దుబొద్దుగా మురిపించిన ముద్దుగుమ్మలు కూడా ఇప్పుడు నాజూకుగా కనిపించి సర్ప్రైజ్ చేస్తున్నారు. అలాంటి కఠోరదీక్షతో నాజూకుగా మారిన హీరోయిన్లలో సొట్టబుగ్గల కుర్రది రాశిఖన్నా కూడా ఉంటుంది. ఈ ఢిల్లీ సోయగం మాములుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించింది. కానీ సెటిల్ అయింది మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే.

ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన రాశి.. ఆ సినిమాలో బొద్దుగా కనిపించింది. ఆ బొద్దు అందంతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో సినిమాలకోసం హీరోయిన్స్ బాడీని మేకోవర్ చేస్తున్నారు. అలాగే సినిమా కోసం రిస్క్ కూడా అలాగే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అమ్మడు తెలుగులో నాగచైతన్య సరసన థాంక్యూ మూవీతో పాటు గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' మూవీ చేస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ పడి సినిమా షూటింగ్స్ - రిలీజులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇంకా పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు.

కానీ ఇటీవలే ఇండియాలో వీలు కావట్లేదని థాంక్యూ బృందం ఇటలీ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. అయితే ఇలాంటి రిస్క్ టైంలో కూడా థాంక్యూ టీమ్ షూటింగ్ పూర్తి చేసుకొని రావడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా ఈ సినిమా విషయాలను షూటింగ్ సమయంలో కష్టాలను బయటపెట్టింది రాశి. అమ్మడు మాట్లాడుతూ.. ముందుగా ఇండియా నుండి బయటికి వెళ్లాలంటే భయం వేసింది. కానీ సినిమా కంప్లీట్ చేయాలి కాబట్టి భయంతోనే ఇటలీకి వెళ్ళాను. అయితే అక్కడ కూడా కొన్ని లొకేషన్స్ లో కరోనా కేసులు బయటపడటంతో మాకు అనుమతి లభించలేదు. అయినా మొత్తానికి చేయాల్సిన షూట్ అంతా కంప్లీట్ చేసాం. షూటింగ్ కంప్లీట్ చేసేందుకు రోజుకు 18గంటలు కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయని' చెప్పుకొచ్చింది అమ్మడు. ప్రస్తుతం రాశి రిస్క్ చేసిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags:    
  • Raashi Khanna 
  • Raashi Khanna thank you movie 
  • Raashi Khanna Movies 
  • Raashi Khanna Latest Updates 
  • naga chaitanya 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS