• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #NBK105 లాంచ్: వినాయక్.....

#NBK105 లాంచ్: వినాయక్.. బోయపాటి అతిథులు

By - Tupaki Desk
Update: 2019-06-13 12:29 GMT
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాపై చాలా నెలల నుంచి వస్తున్న రూమర్లకు.. వాటితో నెలకొన్న కన్ఫ్యూజన్ కు ఈరోజుతో తెరపడింది.  ఫుల్ క్లారిటీ వచ్చింది.  కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ఈరోజే పూజా కార్యక్రమాలు జరిగాయి.  కొబ్బరికాయ కొట్టి సినిమాను లాంచ్ చేశారు కాబట్టి #NBK105 విషయంలో మరోమాటకు తావు లేనట్టే.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు రిలీజ్ అయిన తర్వాత బోయపాటి శ్రీనుతో బాలయ్య సినిమా ఉంటుందని మొదట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  తర్వాత వీవీ వినాయక్ పేరు కూడా వినిపించింది. అయితే వీరిద్దరూ కాదని.. 'జై సింహా' దర్శకుడు కెయస్ రవికుమార్ తో బాలయ్య సినిమా ఉంటుందని అన్నారు.  అయితే ఎలెక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేయాల్సి వచ్చిన కారణంగా కెయస్ రవికుమార్ చిత్రం డిలే అవుతుందని.. బోయపాటితోనే #NBK105 ఉంటుందని అన్నారు.  అయితే తాజాగా బాలయ్య కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కే కొత్త సినిమాను బోయపాటి శ్రీను.. వీవీ వినాయక్ చేతుల మీదుగా ప్రారంభింపజేయడం విశేషం.  

ఈరోజు జరిగిన పూజా కార్యక్రమానికి బోయపాటి శ్రీను.. వీవీ వినాయక్.. కోందండరామిరెడ్డి.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  మొదటి షాట్ కు వినాయక్ క్లాప్ కొట్టారు.  బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.  కోందండరామిరెడ్డి తొలి షాట్ కు గౌరవదర్శకత్వం వహించారు.   #NBK105 ను కెయస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న బాలయ్య ఈ కార్యక్రమంలో బోయపాటి.. వినాయక్ లను భాగస్వాములను చేయడం ద్వారా రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టారు.

ఈ సినిమా కోసం బాలయ్య గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. కెయస్ రవికుమార్ - బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ఇది.  చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. పరుచూరి మురళి కథకు రత్నం డైలాగ్స్ అందించారు. సీ. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభిస్తారు.  

    

Tags:    
  • VV Vinayak 
  • Boyapati Srinu 
  • NBK 105 th 
  • Movie News 
  • Latest Updates 

Similar News

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS